ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 32వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
32. ఓం విజయ ప్రదాయై నమః
అర్థం: భక్తి జ్ఞాన వైరాగ్యాలను పొంది, ఈ సంసారం అనే మహాసాగరం నుండి బయటపడటానికి శ్రీమద్భగవద్గీత మార్గదర్శి అయింది. భౌతిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు పొందటానికి దారి చూపింది. ధర్మ బద్ధంగా విజయం పొందటానికి, ఆపై ముక్తావస్థను పొందటానికి గీతామాత ఆశీర్వదించింది.
భగవద్గీతలో పరమాత్మ చేసిన మొట్టమొదటి బోధ ‘పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి.’ చూడు. ఎదురుగా ఉన్నవాటిని, నీకు దుఃఖం కలిగిస్తున్నవాటిని చూడు. ఎప్పుడైతే అలా చూస్తావో అప్పుడు నీకు దుఃఖాన్ని కలిగిస్తున్న అవలక్షణాలు గమనికకు వస్తాయి. ఒకసారి గమనికకు వచ్చిన తరువాత వాటితో యుద్ధం చేసి, వాటినుండి బయటపడాలి. అలా కాక వాటిని జయించలేననుకుంటూ, భయం పెంచి పోషించుకుంటూ, దుఃఖిస్తూ ఉన్నప్పుడు సంసారం తప్పదు. అది ప్రవృత్తి. ఈ జన్మలోనే కాక జన్మ జన్మలలో ఆ దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. విషాదానికి కారణం అర్థం చేసుకొని బయట పడటమే నివృత్తి.
కామ క్రోధ లోభాలు. అవి ముదిరితే ఏర్పడే మోహం, మదం, మాత్సర్యం. ఈ శత్రువులతో యుద్ధం చేయమని చెపుతుంది గీత. హత్తుకుపోవటం మాని దుఃఖం నుండి బయటపడమని చెపుతుంది. మనలోనే ఉన్న శత్రువుల్ని, మనకు దుఃఖాన్ని కలిగిస్తున్న, జన్మలకు కారణమవుతున్న శత్రువుల్ని జయించి తీరాలి. ఆ తండ్రే సారథ్యం వహిస్తున్నాడు. ఆయనే విజయసారధి. యుద్ధం చేయటానికి కావలసిన ప్రజ్ఞ, స్ఫురణ, నేర్పరితనం, శక్తి, యుక్తి, బలం, ఓర్పు - అన్నింటినీ మనకు ప్రసాదిస్తూనే ఉన్నాడు. అందుకే నీవు గాండీవాన్ని తీసుకొని నిమిత్తంగా ఉండి, యుద్ధం చేయమని పరమాత్మ తెలియజేస్తున్నారు.
ఈ విజయ రహస్యాన్ని నాకు తెలియజేస్తున్న గీతామాతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!