ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 30వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

30. ఓం కర్మయోగ ప్రదాయై నమః

అర్థం:  దైవసంపదను పెంచుకొంటూ, దివ్యశక్తిని కాపాడుకొంటూ ఉన్న నాకు కర్మలను ఎట్లా ఆచరించాలో, కర్మబంధం నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియజేస్తుంది గీతామాత.

కర్మణ్యేవాధికారస్తే 
మా ఫలేషు కదాచన ।
మా కర్మఫల హేతుర్భూః 
మా తే సంగో-స్త్వకర్మణి ॥ 2.47
కర్తవ్య కర్మలు ఆచరించుటలోనే నీకు అధికారం ఉన్నది, దాని ఫలములయందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కావద్దు, కర్మలను మానటంలో ఆసక్తి తగదు అని పరమాత్మ వాక్కు.

యోగస్థః కురు కర్మాణి 
సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా 
సమత్వం యోగ ఉచ్యతే ॥ 2.48
యోగస్థుడవై ఆసక్తిని త్యజించి, సిద్ధి - అసిద్ధుల పట్ల సమభావంతో కర్తవ్య కర్మలను ఆచరించు, అట్టి సమత్వమే యోగం అంటున్నారు పరమాత్మ.

అర్థం:  1. మనసు, 2. వాక్కు, 3. దేహం అనే త్రికరణాల ద్వారా కర్మ జరుగుతుంది. ఇవే మనోవాక్కాయ కర్మలు. కర్మ మూడు విధాలు.
1. సాత్త్విక కర్మ 2. రాజస కర్మ 3. తామస కర్మ.

కర్తృత్వాభిమానం, ఫలాపేక్ష, రాగ ద్వేషాలు లేని శాస్త్రవిహిత కర్మ సాత్త్వికం. ఇది ఉత్తమం. ఇది తనకు, పరులకు మేలు చేస్తుంది. తన శ్రేయస్సు ప్రధానంగా ఆచరించేది రాజసిక కర్మ. దీనిలో రాగం ఉంటుంది. ద్వేషం ఉండదు. ఇది మధ్యమం. తనపట్ల విపరీతమైన రాగంతో, పరుల పట్ల ద్వేషంతో చేసేది తామసిక కర్మ. ఇది అధమం.

జ్ఞానదృష్టి నిలుపుకోవాలంటే సాత్త్విక కర్మలు చేయాలి. రాజసిక, తామసిక కర్మలతో బంధంలో పడతాము.

జ్ఞానదృష్టి ఏర్పడినప్పుడు మనస్సులో ఆత్మభావన స్థిర పరచుకొని నేను ఆత్మ స్వరూపాన్ని, దేహం తన పని తాను చేసుకుంటోంది, ఆ కర్మలతో కానీ, కర్మఫలాలతో కానీ నాకే సంబంధం లేదు అని సంగం లేకుండా, ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించాలి. అప్పుడు కర్మబంధంలో పడము.

జ్ఞానదృష్టి సరిగా ఏర్పడనప్పుడు ఇదంతా నా తండ్రి ఇచ్చిన పని అని, ఒక సేవకుడు వలె ఆ పనులను చేసుకొంటూ, సమస్థితిలో ఉండి, ఏ ఫలం వచ్చినా ప్రసాదంగా స్వీకరిస్తుంటే కర్మబంధంలో పడము.

సమస్త కర్మలను నాయందు అధ్యాత్మ చిత్తంతో సమర్పించమని పరమాత్మ కర్మయోగంలో చెపుతున్నారు. ఆత్మభావనతో ఉండటమే అధ్యాత్మము. నేను ఆత్మస్వరూపాన్ని అన్న దృష్టితో ఈ దేహం ఈ కర్మలను చేస్తుందే తప్ప చేసేది నేను కాదు అని కర్మలన్నిటిని చేయాలి. లోక కల్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆశారహితులై కర్మలను చేయాలి. ఈ పని నేను నా కొరకు చేస్తున్నాను అనేది కర్తృత్వ భావన. అది వదలిపెట్టాలి. ఈ పని ఫలితం నా కొరకు నేను అనుభవిస్తున్నాను అనేది భోక్తృత్వ భావన. అది కూడా వదలిపెట్టాలి. కర్మ, దాని ఫలం అంతా ఈశ్వరార్పణమే.

దేహస్థితికి అవసరం అయిన కర్మ చేయవలసిందే. అయితే అనాసక్తుడై చేయాలి. అదే కర్మ సన్న్యాసం. ఫలాపేక్ష లేని కర్మాచరణే కర్మయోగం.

ఇట్టి శ్రేయస్కరమైన కర్మయోగాన్ని నాకు ప్రసాదించి, కర్మబంధం నుండి, తద్వారా జన్మ పరంపర నుండి నన్ను విముక్తం చేస్తున్న నా తల్లి గీతామాతకు ధన్యవాదంతో తల వంచి నమస్కరిస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!

నామం 21 : Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా!

నామం 20 : Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!

నామం 19 : Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!

నామం 18 : Bhagavad Gita: కురుక్షేత్ర సంగ్రామం జీవిత సమరానికి ప్రతీక.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-18!

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

నామం 9 : Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

నామం 8 :  Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నామం 7 :  Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!

నామం 6 : Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నామం 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

నామం 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

నామం 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

నామం  2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

నామం 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1