ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 22వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
22. ఓం మహా మహిమాన్వితాయై నమః
అర్థం: గీతామాత అందించే పరమ పవిత్రమైన జ్ఞానం మామూలు మనిషిని మహనీయునిగా మార్చగల గొప్ప శక్తి. మహాపాపిని మహాత్మునిగా మార్చగలది. అల్పుడిని అనంతునిగా మార్చే శక్తి. ఆనందం ప్రసాదించే శక్తి.
గీతను ఒక్కసారి చదివినా ఆ వ్యక్తి శుద్ధమైన స్ఫటికం వలె నిర్మలంగా ప్రకాశిస్తాడని, గీతాశాస్త్రాన్ని నిరంతరం పఠించేవారు సాక్షాత్తు దేవస్వరూపులే అవుతారని, ఎవడు అంత్యకాలంలో గీతాశ్లోకాలను శ్రవణం చేస్తాడో అతడు మహాపాపి అయినా మోక్షభాగ్యం పొందగలడని ‘వైష్ణవీయ తంత్రసారము’ చెపుతుంది.
శ్రీమద్భగవద్గీత దుఃఖించేవారిని దుఃఖరహితులుగా చేస్తుంది. దేహభావననుండి ఆత్మభావనలోకి నడిపిస్తుంది. అసత్తు నుండి సత్యానికి దారి చూపుతుంది. మానవత్వం నుండి దివ్యత్వానికి నడిపిస్తుంది. మరణం నుండి అమృతత్వానికి చేర్చుతుంది. అశాశ్వతం నుండి శాశ్వతత్వానికి చేర్చుతుంది.
ఇదే గీతామహిమ. ఇది వాచా వేదాంతం కాదు. ఆచరణ వేదం. పరమ నాస్తికులైనా దానిని ఆచరించి, ఉత్తమ మానవులుగా జీవించగలరు.
అట్టి మహామహిమ గల గీతామాతకు మనసారా వందనం చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!