ఇది కేవలం ట్రంప్ తోనే అంటున్న ..పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహ్బాజ్ షరీఫ్!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) భారతదేశంలో తయారైన మూడు కల్తీ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. కోల్డ్రిఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్, రీలైఫ్ సిరప్‌లను వాడకూడదని తెలిపింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఈ మందుల వాడకం కారణంగా చిన్నారుల మరణాలు సంభవించగా, ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. WHO ప్రపంచ దేశాలను, ఈ ఉత్పత్తులు ఏవైనా దొరికితే వెంటనే సమాచారం అందించాలని కోరింది.

Donald Trump: భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

WHO జాబితాలోని కోల్డ్రిఫ్ సిరప్ స్రెసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారీ, రెస్పిఫ్రెష్ టీఆర్ రెడ్‌నెక్స్ ఫార్మాస్యూటికల్స్, రీలైఫ్ సిరప్ షేప్ ఫార్మాకు చెందినవి. WHO ప్రకారం, ఈ సిరప్‌లలో ప్రాణాంతక రసాయనాలు ఉండటం వల్ల వాటి వాడకం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Petrol-Diesel prizes: తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పెరిగిన పెట్రోల్ ధరలు..! కానీ దేశంలో ఎంత అంటే..!

తమిళనాడులో తయారైన కోల్డ్రిఫ్ సిరప్‌లో డైథిలిన్ గ్లైకాల్ (DEG) విష రసాయనం అత్యధికంగా ఉండగా, సాధారణంగా 0.1 శాతం ఉండాల్సినప్పటికీ 48 శాతం ఉండటం గమనించబడింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. స్రెసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారీ లైసెన్స్ రద్దు చేయబడింది మరియు కంపెనీ యజమాని జి. రంగనాథన్‌ను అరెస్ట్ చేశారు. ఇతర ఔషధ కంపెనీలలోనూ నాణ్యతా తనిఖీలు చేపట్టడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.

AP Farmers: ఏపీలో వారందరికీ శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

మధ్యప్రదేశ్ ఘటనను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు ఇవ్వకూడదని, ఐదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే అత్యవసర సందర్భాల్లో మాత్రమే వాడకూడదని స్పష్టం చేసింది.

నారా లోకేష్ విజన్ ఫలితం.. చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్!!

ఆరోగ్య నిపుణులు ఈ ఘటన పునరావృతం కాకుండా, ఫార్మా రంగంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరమని సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా, పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

Cabinet Sub Committe: స్వర్ణాంధ్ర 2047 దిశగా దీర్ఘకాలిక ప్రణాళిక! కొత్త క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!
Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!
ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!
పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!
అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!