ఓం వ్యాసదేవాయ నమః
ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆంధ్రప్రవాసి ధర్మబాధ్యతగా భావిస్తోంది.
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఒక్కో నామాన్ని ప్రతిరోజూ మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఈ రోజు నుండి ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళి
2. ఓం పరమాత్మ స్వరూపిణ్యై నమః
అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్
- శ్రీమద్భగవద్గీత, 10.32
అర్థం: విద్యలలో అధ్యాత్మ విద్య - బ్రహ్మ విద్య - పరావిద్య నా స్వరూపమే అని ఆ తండ్రి చెపుతున్నారు. గీతలో ఉన్నది పరావిద్య. అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే.
గీతలో ప్రతి అధ్యాయం చివర, ‘ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే..’ అని ఉంటుంది. అంటే శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో ఉన్న ఉపనిషత్తుల సారమైన భగవద్గీత బ్రహ్మవిద్యే అని విష్ణు స్వరూపులైన శ్రీ వ్యాస దేవుల వారు వచనం.
‘గీతా మే హృదయం పార్థ’, ‘గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః’. గీత నా హృదయమే, గీతలోని పరమ విద్య నా స్వరూపమే అని సాక్షాత్తు పరమాత్మే చెపుతున్నారు.
అర్థం: పరమాత్మ శక్తిమంతుడు. గీతామాత పరాశక్తి స్వరూపిణి. శక్తికి, శక్తిమంతునికి ఏ భేదమూ లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.
ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
జై గురుదేవ్
LINK 1: https://www.andhrapravasi.com/news/gita-guide-karma-bhakti-gnana-yoga