ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 24వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
24. ఓం అష్టాదశాధ్యాయిన్యై నమః
అర్థం: శ్రీమద్భగవద్గీత అష్టాదశ దళ పద్మం. అనగా పదునెనిమిది అధ్యాయాలు రేకులుగా గల తామరపువ్వు వంటిది. అందులో 701 శ్లోకాలు. ఈ 18 అధ్యాయాలను తత్త్వాన్ని బట్టి మూడు భాగాలుగా భావిస్తారు. మొదటి 6 అధ్యాయాలను ప్రథమ షట్కము అంటారు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము. అలాగే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు తృతీయ షట్కము.
ప్రథమ షట్కంలో ముఖ్యంగా జీవస్వరూపం (జీవాత్మ) గురించి, కర్మ గురించి పరమాత్మ వివరించారు. నీవు దేహం కాదు, ఆత్మ స్వరూపానివి అని తెలిపారు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని కూడా తెలియజేశారు.
ద్వితీయ షట్కంలో ముఖ్యంగా భగవత్ స్వరూపం (ఈశ్వర స్వరూపము) గురించి తెలియజేశారు. అలాగే ఆ భగవంతుడిని ఆరాధించటానికి ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం గురించి తెలియజేశారు.
తృతీయ షట్కంలో జీవ`ఈశ్వర స్వరూప ఐక్యం, లేదా జీవేశ్వర అభేదం తెలిపారు. జీవాత్మ, పరమాత్మ వేరు కాదు - ఏకమే! అలాగే ఆ తండ్రికి ఎలా ఇష్టులమై అనుగ్రహం పొందాలో తెలిపారు.
ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంసారం. ఒక్కొక్క ప్రారబ్ధం. ప్రతి మనిషికీ ఎన్నో వాసనలు. విభిన్నమైన సంస్కారాలు. ఇన్ని భేదాలు గల ఇందరు మానవులను భగవానుని దగ్గరకు చేర్చటానికి 18 రకాలుగా, 18 అధ్యాయాలుగా గీతోపదేశం ఆవిష్కరించబడిరది.
ఈ విధంగా పదునెనిమిది అధ్యాయాల రూపంగా ఉన్న శ్రీమద్భగవద్గీతకు ప్రీతితో నమోవాకం చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!