ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 27వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
27. ఓం ధ్యాన ప్రదాయై నమః
అర్థం: మోక్షాన్ని పొందాలి అనుకొన్నప్పుడు నిరంతరం ధ్యానస్థితిలో ఉండాలి. శ్రీమద్భగవద్గీతలోని 6 వ అధ్యాయం ఆత్మసంయమ యోగం. దీనినే ధ్యానయోగం అని కూడా అంటారు. ధ్యానం అంటే ఏమిటి?
ఉపాసనా ధ్యానం, నిదిధ్యాసన - రెండు రకాలు. ఉపాసనా ధ్యానం అంటే ఏమిటి? ఒక దైవాన్ని సాకారంగా కానీ నిరాకారంగా కానీ నిరంతరం ఆరాధిస్తూ, ఆ దైవానికి దగ్గరగా ఉంటూ, అసుర భావాలను, అరిషడ్వర్గమును (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) పోగొట్టుకొంటూ, దైవ లక్షణాలను పెంచుకొంటూ ఉంటే మనోమాలిన్యాలు తొలగుతాయి. ఏకాగ్రత ఏర్పడి జ్ఞానబోధను శ్రద్ధగా శ్రవణం చేయటానికి అర్హత వస్తుంది. ఇది ఉపాసన.
అప్పుడు తత్త్వం దర్శించిన జ్ఞాని చెంతకు చేరి, వారు చేసే బోధను శ్రవణం చేసి, శ్రవణం చేసిన దానిని మననం చేస్తూ సంశయాలను పోగొట్టుకోవాలి. తరువాత నిదిధ్యాసన చేయాలి.
ఉపాసన - శ్రవణం - మననం - నిది ధ్యాసన.
నిదిధ్యాసనలో మొదటిది - ప్రతి కర్మలోను ‘నైవ కించిత్ కరోమీతి’ అన్నట్లుగా చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజిస్తూ, త్యజిస్తూ, గ్రహిస్తూ, కనులు తెరుస్తూ, మూస్తూ, ఇంద్రియాలు వాటి పని అవి చేసుకొంటున్నాయి, నేనేమీ చేయటం లేదు, నాకు ఎట్టి సంబంధం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అన్న భావన గట్టిపరుచుకోవాలి. దానికి తగినట్లు మాట, నడవడిక మార్చుకోవాలి. అదే సాధన.
రెండవది - కూర్చుని చేసే ధ్యానం. ఇదే సమాధి అభ్యాసం లేదా ఆత్మ ధ్యానం. ఒక ప్రత్యేక స్థలంలో, నిర్ణీత సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఆత్మగా స్వీయ లక్షణాలు గుర్తు చేసుకుంటూ, ధ్యానించుకొంటూ ఉండటం.
అహమాత్మా - నిరాకారోహం, నిశ్చలోహం, నిర్వికారోహం, నిష్క్రియోహం, సనాతనోహం, సత్యోహం, నిత్యోహం, చిదహం, ఆనందోహం, కూటస్థోహం - అని ఆత్మగా తన లక్షణాలను స్మరించుకుంటూ ఉండటం ఆత్మధ్యానం అవుతుంది.
ఇట్టి మహత్తర ధ్యానం నాకు అందిస్తున్న గీతామాతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!