ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 28వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
28. ఓం దివ్యశక్తి ప్రదాయై నమః
అర్థం: ధ్యానం నిరంతరం సాగాలంటే ఒక దివ్యశక్తి తోడై ఉండాలి. అప్పుడే అవిచ్ఛిన్నంగా ఆత్మానుసంధానం చేసుకోవటానికి వీలవుతుంది.
భగవద్గీత మనలను సంకల్పంతో కూడిన కోరికలను వదలమని చెపుతుంది. మనసులో కలిగే ఏ ఆలోచన అయినా మననం చేస్తూ, పదే పదే ఊహిస్తూ, భావిస్తూ, సుఖదుఃఖాలతో కూడిన భావోద్వేగాలకు లోను చేస్తుంటే అది సంకల్పం అనబడుతుంది. మాటిమాటికీ మననం చేయటం వలన చిత్తంలో సంస్కారం ఏర్పడి, అదే వాసనగా మారుతుంది. వాసనే కర్మలకు కారణం. కర్మలే జన్మలకు కారణం. కర్మఫలాలను అనుభవించటానికి జన్మలు తీసుకోవాలి. కోరికలు, భావావేశాలతో సంగమం లేనట్లయితే అది అసంకల్పం. సంకల్పాలను శేషం లేకుండా వదిలితే స్వరూపశాంతిని పొందగలవు అని శ్రీమద్భగవద్గీత చెపుతుంది.
యుంజున్నేవం సదా-త్మానం
యోగీ నియత మానసః ।
శాంతిం నిర్వాణ పరమాం
మత్సంస్థామధిగచ్ఛతి ॥ 6.15
మనో నిగ్రహం గల యోగి ఎల్లప్పుడు మనస్సును ఆత్మధ్యానంలో నిలిపి, నాయందున్న పరమ మోక్షరూపమైన, పరమానంద రూపమైన శాంతిని పొందుతున్నాడు.
ఈ విధంగా శ్రవణం, మననం, నిదిధ్యాసన సరియైన రీతిలో ఆచరింపజేస్తూ ఆపైన వాసనాక్షయాన్ని చేసే దివ్యశక్తిని నా తల్లి నాకు ప్రసాదిస్తుంది.
విశ్వరూప సందర్శన యోగంలో దివ్యాభరణ, దివ్యాయుధ, దివ్యమాలా, దివ్యాంబరాలతో సాక్షాత్కరించిన భగవానుని విశ్వరూపం దర్శిస్తాము. అట్టి మహాశక్తిమయుని స్వరూపమై ఆ దివ్యశక్తిని నాకు ప్రసాదిస్తున్న గీతామాతకు నిండుమనస్సుతో నమస్కృతి సమర్పిస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!