ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 31వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

31. ఓం భక్తి జ్ఞాన వైరాగ్య ప్రదాయై నమః

యథార్ధమైన భక్తి ఏమిటో, జ్ఞానాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలో, వైరాగ్య భావన ఎలా ఏర్పరుచుకోవాలో తెలియజేసింది గీతామాత.

భక్తి :
యో మద్భక్తః స మే ప్రియః । 12.16

అర్థం:  ఎవరు నా భక్తుడో అతడు నాకు ఇష్టుడు అని చెపుతున్నారు. భక్తుడికి ఉండవలసిన 35 లక్షణాలు భక్తి యోగంలో తెలుపబడ్డాయి. ద్వేషం లేకపోవుట, మైత్రి, కరుణ, నిర్మమకారం, నిరహంకారం, సుఖ దుఃఖ సమభావం, ఓర్పు, సంతృప్తి, అనపేక్ష, భగవదర్పిత బుద్ధి, బాహ్యాంతర శుద్ధి మొదలైనవి భక్తుని లక్షణాలు.
భగవంతుని యందు ప్రీతి కలిగి ఉండుటయే భక్తి. అన్య (ఇతర) భావం లేకపోవుట - అనగా భగవానుని పట్ల తప్ప ఇతర విషయాల పట్ల చిత్తం లగ్నం కాకపోవటమే అనన్య భక్తి. అది కలిగిన వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను (యోగక్షేమం వహామ్యహమ్‌) అని భగవాన్‌ ఉవాచ.

శ్రీమహాభాగవతంలో మొసలి బారిని పడిన గజేంద్రుడు శక్తిహీనుడై, ‘నీవే తప్ప నితఃపరంబెరుగ, మన్నింపం దగున్‌ దీనునిన్‌’ అని భగవానుని ప్రార్థించాడు. భగవత్‌ కృపతో క్షేమంగా బయటపడ్డాడు.

విభక్తి కానిది భక్తి. అనగా విభజన లేనిది. భగవత్‌ స్వరూపం నుండి విడివడకుండా దానియందే మనసు లగ్నం చేయటమే భక్తి. భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం - ఏది సమర్పించినా ప్రీతితో ఆరగిస్తానని పరమాత్మ రాజవిద్యా రాజగుహ్య యోగంలో చెప్పారు.  ఆ నాలుగు ఏవో కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి అంతఃకరణ చతుష్టయం. ఈ నాలుగు ఆయనకు అర్పించాలి. మనస్సు ఆలోచన, విశ్లేషణ చేస్తుంది. బుద్ధి నిశ్చయం చేస్తుంది. చిత్తం ఒకదానినుండి మరొక దానికి చలిస్తుంటుంది. అహంకారం ‘నేను’ అనే దేహభావనతో కూడి     ఉంటుంది. ఈ నాలుగు శుద్ధి చేసుకొన్నట్లయితే అప్పుడు చక్కగా ఆత్మజ్ఞానం పొందగలము.

జ్ఞానము :
శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగంలో జ్ఞాన తపస్సు గూర్చి చెప్పబడిరది. రాగం గాని, భయం గాని, క్రోధం గాని లేకపోవుట, భగవన్మయుడై ఉండుట, భగవంతుని ఆశ్రయించుట ` ఇదంతా జ్ఞాన తపస్సు. దీని వలన చిత్తశుద్ధి, పరమాత్మ స్వరూప ప్రాప్తి కలుగుతాయి. మనో నిగ్రహం ఏర్పడుతుంది. తత్త్వ విచారణ, ఆత్మానాత్మ వివేకం, ఇంద్రియ నిగ్రహం, దృక్‌ దృశ్య వివేచన, శ్రవణ మనన నిదిధ్యాసనలు, వాసనాక్షయం మొదలైనవి జ్ఞానయజ్ఞం అవుతాయి.

నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే । 4.38

జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది లోకంలో లేదు.

వైరాగ్యము :
రాగం లేకపోవటమే వైరాగ్యం. లోకంలో మనకు సంబంధించిన వ్యక్తులు గాని, వస్తువులు గాని, విషయాలు గాని మనం కోరుకున్నట్లుగా, మనకిష్టమైనట్లుగా ఉండాలనుకొంటాం. అదే రాగం. అవి అట్లా ఉండకపోతే విచారిస్తాం. ప్రేమాతిశయమే రాగం. రాగమే దుఃఖానికి మూల కారణం. రాగం వదిలిపెట్టటమే వైరాగ్యం. విరాగునికి దుఃఖం ఉండదు. అన్నిటి పట్లా సమదృష్టి ఉంటుంది.

ఈ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తున్న శ్రీమద్భగవద్గీతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!

నామం 21 : Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా!

నామం 20 : Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!

నామం 19 : Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!

నామం 18 : Bhagavad Gita: కురుక్షేత్ర సంగ్రామం జీవిత సమరానికి ప్రతీక.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-18!

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

నామం 9 : Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

నామం 8 :  Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నామం 7 :  Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!

నామం 6 : Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నామం 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

నామం 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

నామం 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

నామం  2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

నామం 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1