ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 25వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
25. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
గతిర్భర్తా ప్రభుః సాక్షీ
నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం
నిధానం బీజమవ్యయమ్ ॥ 9.18
సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యం నేనే. స్వామి, సాక్షి, నివాసం, ఆశ్రయం మరియు స్నేహితుడను నేనే. సృష్టి స్థితి లయకర్తను నేనే. శాశ్వతస్థానం మరియు సనాతన బీజం నేనే అయి ఉన్నాను అని భగవాన్ ఉవాచ.
అట్టి పరమాత్మ యొక్క త్రివిధ వ్యక్త రూపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ముల్లోకాలకు పాలకులు. సృష్టి స్థితి లయ కారకులు. ఆవిర్భావము, వికాసము, వినాశము అనే మూడు ధర్మాల ప్రకారమే జగత్తు సాగుతున్నది. ఈ ధర్మాలకు అధిపతులు త్రిమూర్తులు.
మరి గీతామాత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఎలా అవుతుంది? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి అంతర్లీనంగా జ్ఞానం ఉంటుంది. అయితే అది అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. నాలో ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపి నేనెవరో నాకు తెలియజేస్తుంది గీతామాత. అదే అసలైన సృష్టి. శాశ్వతమైన, సత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని నాకు అందించేటప్పుడు గీతామాత బ్రహ్మ స్వరూపమే.
నాలో మేల్కొన్న జ్ఞానం దినదినాభివృద్ధి చెంది, ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కటానికి అవసరమైన జ్ఞానసంపదను నాకు ఇస్తున్నప్పుడు ఆ తల్లి విష్ణు స్వరూపమే.
భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ఏర్పరచుకొని, ఆ జ్ఞానం వలన పునర్జన్మ లేని శాశ్వతమైన పరమాత్మ సాయుజ్యాన్ని పొందే చివరిమెట్టు ఎక్కించి తనలో లయం చేసుకొనే సమయంలో ఆ తల్లి మహేశ్వర స్వరూపమే.
గీతాజ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ ।
గీతాజ్ఞానం ప్రకారమే ముల్లోకాలను పాలిస్తున్నాను అంటున్నారు పరమాత్మ ఈ విధంగా త్రిమూర్తి స్వరూపమైన గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!