ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 5వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

5. ఓం సనాతన ధర్మ స్వరూపిణ్యై నమః

అర్థం: ఆది, అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం. ‘ధారయతీతి ధర్మః’. ధరించేది ధర్మం. ధర్మం దేనిని ధరిస్తుంది? లోకాన్ని ధరిస్తుంది. అనగా ప్రపంచ స్థితికి ఆధారభూతమైనది ధర్మం.

ఆధ్యాత్మిక జీవితానికి ఎట్టి సంసిద్ధతతో ఉండాలన్నది, మత జీవితంలో ఎలా ఉండాలన్నది సనాతన ధర్మం వివరిస్తుంది. పరమాత్మ దృష్టి పరిధిలో ఉండి, ఆయనతో ఏకం కావటానికి ఏ విధంగా జీవించాలో తెలియజేసేదే సనాతన ధర్మం.శ్రీమద్భగవద్గీత సనాతన ధర్మ స్వరూపం. ఏ ధర్మం ఆచరిస్తే మన జీవితం సార్థకం అవుతుందో, దుఃఖం నుండి విముక్తం అవుతామో గీతామాత చెపుతుంది.  

యే తు ధర్మ్యామృతమిదం 
 యథోక్తం పర్యుపాసతే ।
శ్రద్దధానా మత్పరమా 
 భక్తాస్తే -తీవ మే ప్రియాః ॥ 12.20

అర్థం: నేను తెలిపిన ఈ ధర్మ స్వరూపమైన అమృతాన్ని ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు అని భగవాన్‌ ఉవాచ.

ఇట్టి సనాతన ధర్మ స్వరూపిణి అయిన గీతామాతకు ప్రగాఢ విశ్వాసంతో ప్రణామం చేస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్ 

Link 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1

link 2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

link 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

 link 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!