ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 6వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

6. ఓం సకల దేవతా స్వరూపిణ్యై నమః

అర్థం: గీత సాక్షాత్తు భగవంతుని ముఖారవిందం నుండి వెలువడిందని మహాభారతంలో చెప్పబడినది. చైతన్య శక్తి చలించి పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి రూపంలో మన అనుభవానికి వస్తుంది. భగవద్గీత స్వయంగా ఆ పరమాత్మ శక్తే! అంటే సాక్షాత్తు పరాశక్తి! పరాశక్తే సకల దేవతలకూ ఆధారం.

ఎవరి ఇష్టాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి వారు రక రకాల దేవతా స్వరూపాలను కొలుస్తుంటారు. దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారని, పరమాత్మను ఆరాధించేవారు పరమాత్మను పొందుతారని రాజగుహ్య యోగంలో భగవద్గీత చెపుతుంది. ఆ పరమాత్మ తత్త్వ దర్శనమే గీత.

సర్వే దేవాశ్చ ఋషయో
  యోగినః పన్నగాశ్చ యే ।
గోపాలా గోపికా వాపి
  నారదోద్ధవ పార్షదైః ।
సహాయో జాయతే శీఘ్రం 
 యత్ర గీతా ప్రవర్తతే ॥
     -వరాహ పురాణము

అర్థం: శ్రీమద్భగవద్గీతను ఎక్కడైతే ఆరాధిస్తూ, పఠిస్తూ, ఆచరిస్తూ ఉన్నారో అక్కడ సకల దేవతలు, ఋషులు, యోగులు, నారదాది ముని పుంగవులు కూడా కొలువై ఉన్నారు. నీకు వెంటనే సహాయం చేయటానికై వేచి ఉన్నారు.  

ఏకమేవా-ద్వితీయం బ్రహ్మ  -ఛాందోగ్యోపనిషత్తు.

పరమాత్మ ఒక్కడే, మరొకరు లేరు. సమస్త దేవతల స్వరూపం ఒక్కటే. పరమాత్మ తత్త్వం అనేక విధాలుగా లేదు. ఏకంగా ఉంది. భగవంతుడు - పరమాత్మ - సృష్టికర్త ఒక్కరే! యజ్ఞ దాన తపః కర్మల ద్వారా నన్ను పవిత్రుడిని చేసి, ఆ ఏకైక పరమాత్మ దర్శనం, అనుగ్రహం, మోక్షం కలిగించగలిగేది గీతామాత మాత్రమే.

పరాశక్తి రూపంలో సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీతకు ఆరాధనాభావంతో అంజలి ఘటిస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్ 

Link 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1

link 2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

link 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

 link 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

 link 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!