ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 23వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
23. ఓం వ్యాస సంగ్రథితాయై నమః
అర్థం: కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో యుద్ధ సన్నద్ధుడైన అర్జునుడు కౌరవసేనలో బంధు, గురు, మిత్రులను చూసి, వారినందరినీ వధించి పాపం మూటగట్టుకోలేనని అస్త్ర సన్న్యాసం చేశాడు. అప్పుడు పార్థ సారధియైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విషాదం పోగొట్టి, కర్తవ్యం వైపు మళ్లించాడు.
అర్జునుడి సందేహం - ప్రశ్న - శ్రీకృష్ణుని ప్రత్యుత్తరం. ఈ విధంగా గీతోపదేశం సాగింది. ప్రశ్నోత్తర రూపమైన సంవాదాన్ని ‘గీత’ అంటారు. ‘భగవంతం ప్రతి భగవతా గీతా’ అని నిర్వచనం. అనగా భగవత్ తత్త్వం గూర్చి భగవంతుడే గానం చేసినది గీత.
ఆ మహా సందర్భంలో గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నవారు నలుగురు. 1. ఆర్జునుడు, 2. అర్జునుడి రథం టెక్కెంపై ఉన్న హనుమంతుడు, 3. వ్యాసమహర్షి, 4. వ్యాసమహర్షి అనుగ్రహంతో సంజయుడు.
గీతోపదేశాన్ని గ్రహించి కర్తవ్యపరాయణుడైన వాడు అర్జునుడే అయినా ఆ ఉపదేశం సమస్త మానవాళికీ అవసరమైనదే. అక్కడ అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని గ్రహించి, గ్రంథబద్ధం చేసి లోకానికి అందించిన వారు శ్రీ వ్యాసమహర్షి. వారి అమేయప్రజ్ఞ వల్లనే ఆ 701 శ్లోకాలు శ్రీమద్భగవద్గీతగా కూర్చబడిరది. సమస్త మానవాళికి మేలు కలిగింది.
వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్
ఏతత్ గుహ్యతమం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్
సాక్షాత్ కథయతః స్వయమ్ ॥ 18.75
అర్థం: శ్రీ వ్యాసమహర్షి అనుగ్రహం చేత, నేను ఈ రహస్యమైన, శ్రేష్ఠమైన, యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి తెలుసుకొన్నాను అని సంజయుడు చెపుతున్నాడు.
ఈ విధంగా వేదవ్యాస మహర్షిచే కూర్చబడిన శ్రీమద్భగవద్గీతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!
నామం 7 : Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!