ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 15వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

15. ఓం మంగళ స్వరూపిణ్యై నమః

అర్థం: మంగళము అంటే శుభం, క్షేమం. శ్రీమద్భగవద్గీత అంతటా శుభకరమైన విషయాలే ఉన్నాయి. అక్కడ కౌరవ పాండవ యుద్ధం కేవలం ఒక ప్రస్తావన మాత్రమే. సకల శ్రేయస్కరమైన గీతను పఠించిన ప్రతి వ్యక్తికి సుఖ శాంతులు లభిస్తున్నాయి. కనుక భగవద్గీత మంగళప్రదమైనది. నా జీవితం మంగళకరంగా సాగటానికీ, ఇక్కడ నేను సుఖశాంతులతో ఉండటానికీ గీత మార్గం చూపుతుంది.

మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః । ఆగమాపాయినో-నిత్యాః తాంస్తితిక్షస్వ భారత ॥ 2.14

అర్థం: విషయ సంబంధాలు చలిని, వేడిని, సుఖదుఃఖాలను కలిగిస్తాయి. అవి అనిత్యాలు. వచ్చి పోయేవి. కావున వాటిని సహించాలని భగవానుని వచనం.

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః ॥ 6.7

అర్థం: శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు మొదలైన ద్వంద్వాలకు చలింపక వానియందు సమబుద్ధి గలిగిన వాడు, పరమ శాంతుడు, ఆత్మ విజయం గలవాడు పరమాత్మానుభవం పొందుతున్నాడు. పరమాత్మానుభవమే మంగళం. ప్రశాంత చిత్తుడు, పరమ శాంతుడు ఇహలోకంలో సుఖశాంతులు పొందటమే గాక, జన్మ దుఃఖాలనుండి విముక్తుడు అవుతాడని గీతా వాక్యం.

నేనెవరో నాకు తెలిపి, అన్ని వేళలా ఆత్మస్మరణలో ఉండటమే మంగళకరం అని ప్రబోధిస్తున్న గీతామాతకు నిండుమనస్సుతో నమస్కృతి సమర్పిస్తున్నాను.    

జై గురుదేవ్ 

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

నామం 9 : Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

నామం 8 :  Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నామం 7 :  Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!

నామం 6 : Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నామం 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

నామం 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

నామం 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

నామం  2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

నామం 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1