ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేష్ గత కొన్నేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన దృష్టిలో ఐటీ రంగం కేవలం సాంకేతిక అభివృద్ధికే కాకుండా — ఉద్యోగావకాశాలు, ఆర్థిక ప్రగతి, మరియు గ్లోబల్ ఇమేజ్‌కి మూలస్థంభం.
రాష్ట్రంలోని ప్రతీ యువకుడికి టెక్నాలజీ ద్వారా అవకాశాలు అందించాలనే సంకల్పంతో లోకేష్ అనేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఎకానమీ దిశగా ముందడుగు వేసింది. సాంకేతిక పరిజ్ఞానం గ్రామాలకూ చేరాలనే దృష్టితో “డిజిటల్ ఆంధ్రప్రదేశ్” అనే కలను వాస్తవం చేయడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన గత ఏడాది అక్టోబర్ (2024)లో అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని (Google HQ) సందర్శించారు. ఆ సందర్శనలోనే ఒక పెద్ద దిశలో ఆలోచన మొదలైంది ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయం రాయాలి.
ఆ ఆలోచనను వాస్తవం చేయడానికి నారా లోకేష్ గత ఏడాది నుంచి గూగుల్ ప్రతినిధులతో అనేక చర్చలు, సమావేశాలు నిర్వహించారు. ఆయన నాయకత్వం, స్పష్టమైన దృష్టి, మరియు ప్రభుత్వ సహకారంతో ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి.
రేపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ కంపెనీ మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదరబోతోంది. ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ మన రాష్ట్రంలో 1 గిగావాట్ (1 GW) స్థాయి భారీ ప్రాజెక్టును ప్రారంభించనుంది.
ఈ ప్రాజెక్టుకు 10 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు 83 వేల కోట్లు రూపాయలు) పెట్టుబడిగా రానున్నాయి. ఇది రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సెంటర్ నిర్వహణ, పర్యావరణ సాంకేతికత, ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు, నైపుణ్యాభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకుంటాయి.
నారా లోకేష్ X పేర్కొన్నట్లు..
2024 అక్టోబర్‌లో నేను గూగుల్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ టెక్ మ్యాప్‌లో నిలపాలనే సంకల్పం పుట్టింది. ఏడాది పాటు సాగిన కృషి ఫలితంగా రేపు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. గూగుల్ మన రాష్ట్రంలో 1 GW ప్రాజెక్టుతో $10 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఇది మన డిజిటల్ భవిష్యత్తుకు కొత్త శకం ప్రారంభం.
ఈ పెట్టుబడి కేవలం ఆర్థిక పరంగా కాకుండా సాంకేతికంగా మరియు పర్యావరణ పరంగా కూడా గొప్ప మైలురాయి. గూగుల్ ప్రాజెక్టు పూర్తిగా Green Energy ఆధారంగా నడుస్తుంది. దీని ద్వారా పర్యావరణానికి మేలు, కార్బన్ ఉద్గారాల నియంత్రణ, మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలుస్తుంది.
ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ టెక్ మ్యాప్‌లో ఒక ప్రముఖ కేంద్రంగా నిలబెట్టబోతోంది. ఇతర అంతర్జాతీయ కంపెనీలు కూడా రాష్ట్రం వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని నారా లోకేష్ అన్నారు.