ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 18వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

18. ఓం సర్వోపనిషత్‌ సార రూపిణ్యై నమః

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందనః ।
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌ ॥        -వైష్ణవీయ తంత్రసారము

అర్థం: అన్ని ఉపనిషత్తుల సముదాయం గోవు. పాలు పితికేది గోపాల బాలుడు కృష్ణుడు. లేగదూడ కుంతి కొడుకు అర్జునుడు. పాలు అమృతతుల్యమైన శ్రేష్ఠమైన భగవద్గీత.

ఉపనిషత్తులకే ‘వేదాంతము’ అని పేరు. వేద+అంతము = వేదాంతము. వేదాలకు అనుబంధంగా కడపట వచ్చేవి. ఉపనిషత్తులు. సంసార మూల హేతువును నాశనం చేసేవి ఉపనిషత్తులు. అవి వేద విజ్ఞానానికి గమ్యం. జగత్తు, జీవుడు,  రాగ విరాగాలు, పర బ్రహ్మము మొదలైన అనేక విషయాలను మహర్షులు అన్వేషించి, అందలి పరమ సత్యాలను ఉపనిషత్తులలో ఉగ్గడించారు.

ఉపనిషత్తులు అసంఖ్యాకంగా ఉన్నా వాటిలో ప్రధానంగా 108 పేర్కొంటారు. అందులోనూ దశోపనిషత్తులు ప్రసిద్ధం అయ్యాయి.
1. ఈశావాస్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు,                8. ఐతరీయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.

ఈశావాస్యమిదగ్‌ సర్వం యత్కించ జగత్యాం జగత్‌        -ఈశావాస్యోపనిషత్తు
అర్థం: పరిణామశీలమైన ఈ జగత్తు ఈశ్వరునిచే (పరమాత్మచే) పరివ్యాప్తమై ఉన్నది. ఎవడు సర్వ ప్రాణులను తనలో చూస్తాడో, సర్వ భూతములయందు తన ఆత్మను దర్శిస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు అని ఈ ఉపనిషత్తు చెపుతుంది. అదే విధంగా భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో, ఆత్మయోగి సమదృష్టితో సమస్త ప్రాణులలో తనను, సమస్త ప్రాణులను తనలో దర్శిస్తాడని చెప్పబడింది.    

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ -తైత్తిరీయోపనిషత్తు
బ్రహ్మము సత్య స్వరూపం, జ్ఞాన స్వరూపం. అది అనంతం. ఈ దృశ్యజగత్తు అంతా ఓంకారమే అని మాండూక్యోపనిషత్తు వక్కాణిస్తుంది. ఈ జగత్తునకు నేనే ఓంకార / ప్రణవ స్వరూపుడనై ఉన్నాను అని పరమాత్మ చెపుతున్నారు.

ఈ విధంగా సర్వ ఉపనిషత్సారం భగవద్గీతలో నిక్షిప్తమై ఉండటం చేత శ్రీమద్భగవద్గీతోపనిషత్తు అనే పేరు వచ్చింది. అట్టి సకల ఉపనిషత్తుల సారమైన శ్రీమద్భగవద్గీతకు జ్ఞానదృష్టితో కైమోడ్పు చేస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

నామం 9 : Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

నామం 8 :  Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నామం 7 :  Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!

నామం 6 : Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నామం 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

నామం 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

నామం 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

నామం  2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

నామం 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1