ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 29వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

29. ఓం దైవ సంపత్‌ ప్రదాయై నమః

సంపద అంటే ఐశ్వర్యం. దైవసంపద అంటే దైవికములైన సద్గుణముల యొక్క సంపత్తి. శీలసంపద. ఆ సంపద ఉండగా మరి ఏ సంపదతోనూ పని లేదు. మనలోని దివ్యశక్తిని నిల్పుకోవాలంటే అసుర భావాలను పోగొట్టుకొని దైవసంపదను పెంపొందించుకోవాలి.

అభయం సత్త్వ సంశుద్ధిః 
జ్ఞాన యోగ వ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ 
స్వాధ్యాయః తప ఆర్జవమ్‌ ॥ 16.1
అహింసా సత్యమక్రోధః  
త్యాగః శాంతిరపైశునమ్‌ ।
దయా భూతేష్వలోలత్వం 
మార్దవం హ్రీరచాపలమ్‌ ॥ 16.2
తేజః క్షమా ధృతిః 
శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం 
దైవీమభిజాతస్య భారత ॥ 16.3
1. నిర్భయము, 2. అంతఃకరణ శుద్ధి, 3. జ్ఞానయోగములో ఉండుట,  4. దానము, 5. బాహ్యేంద్రియ నిగ్రహము, 6. జ్ఞానయజ్ఞము, 7. శాస్త్ర అధ్యయనము, 8. తపస్సు, 9. ఋజుత్వము, 10. అహింస, 11. సత్యము, 12. కోపము లేకుండుట, 13. త్యాగబుద్ధి, 14. శాంత స్వభావము, 15. చాడీలు చెప్పకుండుట, 16. దయ, 17. విషయ లోలత్వము లేకుండుట, 18. మృదుత్వము, 19. అధర్మ కార్యములందు సిగ్గు, 20. చంచలత్వము లేకుండుట, 21. తేజస్సు, 22. ఓర్పు, 23. ధైర్యము, 24. శుచిత్వము, 25. ద్రోహచింతన లేకుండుట, 26. దురభిమానము లేకుండుట - ఈ 26 గుణాలే దైవ సంపద.

అర్థం: దైవ లక్షణాలు ఆనందానికి, శాంతికి, సంతృప్తికి, మోక్షానికి కారణం అవుతుంటే, అసుర లక్షణాలు దుఃఖానికి, అలజడికి, ఆందోళనకి, బాధకి, భయానికి, అశాంతికి, నరకానికి కారణం అవుతున్నాయని గీత చెపుతుంది.

దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా । 16.5
అసుర భావాలతో ప్రవర్తించే ప్రతి సమయంలో మనస్సు అశాంతిగా, అలజడిగా, ఆందోళనగా, భయంగా ఉంటుంది. పాము ఉన్న ఇంటిలో ఉన్నట్టే   ఉంటుంది. ఒక వ్యాపారి దొంగ వ్యాపారంలో కోట్లు గడించవచ్చు. కాని అతనికి సంతోషం ఉంటుందా? ఏ అధికారులు దాడి చేసి అంతా పట్టుకుపోతారో, ఎప్పుడు కారాగారం పాలవుతానో అని రాత్రింబగళ్లు భయమే కదా? భగవద్గీత విజ్ఞాన యోగంలో భగవానుడు ఒకటే చెపుతున్నారు.

ధర్మావిరుద్ధో భూతేషు కామో-స్మి । 7.11
నేను ప్రాణులయందు ధర్మ విరుద్ధం కాని కోరికనై ఉన్నాను.

అర్థం: అంటే ధర్మబద్ధమైన కోరికే భగవత్‌ స్వరూపం. మన కోరిక మనకు అశాంతి, అలజడి కలిగిస్తూ ఉంటే, చేసే పని అశాంతి కలిగిస్తూ ఉంటే, అది ధర్మసమ్మతం కాదని అర్థం. మన కోరిక, మన మాట, మన చేష్ట మనకు, ఇతరులకు శాంతిని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తూ ఉంటే, అది ధర్మబద్ధం. ఆచరణయోగ్యం.

కనుక దైవలక్షణాలను పెంచుకొని అందరి పట్ల ప్రేమతో, కరుణతో వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, ప్రతి క్షణం శాంతిగా ఉండగలుగుతాము. 
అట్టి దైవసంపద ప్రసాదిస్తున్న గీతామాతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!

నామం 21 : Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా!

నామం 20 : Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!

నామం 19 : Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!

నామం 18 : Bhagavad Gita: కురుక్షేత్ర సంగ్రామం జీవిత సమరానికి ప్రతీక.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-18!

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

నామం 9 : Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

నామం 8 :  Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నామం 7 :  Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!

నామం 6 : Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నామం 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

నామం 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

నామం 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

నామం  2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

నామం 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1