Nara Lokesh: కొక్కిలగడ్డలో శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్!
Nara Lokesh: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలగడ్డలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.
జడ్పీ పాఠశాల ప్రారంభం అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్..
శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆశీస్సులు పొందిన మంత్రి లోకేష్..
మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలగడ్డలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.
కొక్కిలగడ్డ జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ గ్రామంలోని ప్రముఖ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ పండితులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
అలాగే మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్, జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి లోకేష్ ఆలయ దర్శనం సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొన్నారు.
Tags
Be the first to react