Ongole: ఒంగోలులో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలు!
Ongole: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా మంత్రులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన మంత్రులు.. భారీగా పాల్గొన్న ప్రజలు..
ఎస్జీవీఎస్ కన్వెన్షన్లో ప్రభుత్వ విజయాలను ఆవిష్కరించిన మంత్రులు..
ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా మంత్రులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను వివరించేందుకు ఈ విజయోత్సవాలను నిర్వహించారు.
ఈ వేడుకలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఎస్జీవీఎస్ కన్వెన్షన్ ప్రాంగణంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లలో పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు స్టాళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిని జిల్లా కలెక్టర్ రాజాబాబు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు ప్రధాన లక్ష్యాలుగా తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
విజయోత్సవ వేడుకల్లో భాగంగా జలధార – జలహారతి, జల సురక్షా మాసం, రెండేళ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2.0 వంటి పథకాలు లక్షలాది కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రాంగణంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే వేదికగా ఈ విజయోత్సవ వేడుక నిలిచింది.
Tags
Be the first to react