Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలక పారిశ్రామిక, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు వివరించారు.

Nara Lokesh
Nara Lokesh

ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కోల్కతాలో భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం..

పోర్టులు, మౌలిక వసతులతో ఏపీకి భారీ పెట్టుబడుల అవకాశాలు: మంత్రి లోకేష్..

కోల్కతా: ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే కీలక పారిశ్రామిక, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు వివరించారు. కోల్కతా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక రంగ ప్రముఖులతో మంత్రి సమావేశమయ్యారు.

వీసా స్టీల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి కోసం అమలు చేస్తున్న విధానాలను వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు. దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ను తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.

రాష్ట్రానికి ఉన్న విస్తారమైన తీరప్రాంతం, ప్రపంచ స్థాయి పోర్టులు, మెరుగవుతున్న రవాణా సదుపాయాలు, భూమి మరియు విద్యుత్ లభ్యత, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు పరిశ్రమలకు పెద్ద అవకాశాలని మంత్రి వివరించారు.

భారతదేశంలోనే ప్రముఖ ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం పనిచేస్తోందని నారా లోకేష్ తెలిపారు. అనకాపల్లి సమీపంలో ప్రారంభమైన ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కొత్త దిశ చూపుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు దేశ ఆర్థిక పరిస్థితులు, మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగ అవకాశాలు, పరిశ్రమలు–ప్రభుత్వం మధ్య భాగస్వామ్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పెట్టుబడులను సులభతరం చేయడంలో, పరిశ్రమల వృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.

రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ కోరారు. పెట్టుబడులు, పరిశ్రమలు పెరగడం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.

Tags

Be the first to react

Latest