LIVE
PM Kisan 23rd installment: రైతన్నల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. 23వ విడతను విడుదల చేసిన ప్రధాని మోదీ! ఇలా చెక్ చేసుకోండి!  •  Machilipatnam: మచిలీపట్నంలో ఘనంగా మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు!  •  Road Extension: అమరావతి కేవలం 5 గంటల్లోనే... నాలుగు వరుసలుగా మారనున్న జాతీయ రహదారి విస్తరణ!  •  హిందీ మాట్లాడటం నేర్చుకుంటే మంచి భవిష్యత్తు! రాష్ట్ర వ్యాప్త బాలల ‘హిందీ టాలెంట్' పురస్కారాల ప్రదానం!  •  Singapore: సింగపూర్‌లో తెలుగు వారందరికీ TDFS ప్రత్యేక ఆహ్వానం... మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ఆత్మీయ సమావేశం!  •  Weather Report: ఏపీ ప్రజలకు అలర్ట్... ఈ 15 జిల్లాలకు వర్ష సూచన! గంటకు 50 కిలోమీటర్ల వేగంతో...  •  Transit Visa: భారతీయులకు బంపర్ ఆఫర్... ట్రాన్సిట్ వీసా అవసరం లేకుండానే ఆ దేశం చుట్టి రావచ్చు!!  •  Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్.. కొండెక్కిన బంగారం ధరలు! తులం ఎంతంటే...  •  Tunnel Roads: నగరంలో భూగర్భ టన్నెల్ రోడ్లు... ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, మంత్రి కీలక ప్రకటన!  •  Amaravati Green City: నీలి, హరిత నగరంగా అమరావతి... 34 రాచమార్గాలకు ఇరువైపులా రంగురంగుల పూలవనం!  • 
⚡ BREAKING
Andhra Pradesh

Chandrababu: రైతులకు అండగా ప్రభుత్వం.. అభివృద్ధి, ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం.. సీఎం చంద్రబాబు హామీ!

Chandrababu: పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం అనంతరం లింగంగుంట్లలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రకృతి సేద్యం, సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Kasthuri S 3 min read
Chandra Babu Naidu
Chandra Babu Naidu

రైతు సంక్షేమమే లక్ష్యం.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవతో అన్నదాతలకు అండగా ప్రభుత్వం..

వ్యవసాయం నుంచి టెక్నాలజీ వరకు ఏపీ అభివృద్ధి దిశగా పయనం: సీఎం చంద్రబాబు..

చిలకలూరిపేట: పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం అనంతరం లింగంగుంట్లలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రకృతి సేద్యం, సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్‌తో కలిసి పాల్గొన్నానని, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ ద్వారా రూ.3,125 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విడుదల చేశాయని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం మూడు విడతల్లో అందిస్తున్నామని సీఎం వివరించారు. తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున జమ చేశామని చెప్పారు. విత్తనాల సరఫరా నుంచి పంటల మార్కెటింగ్ వరకు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గతంలో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయ సూచనలు అందించేందుకు ఫోన్ల ద్వారా సమాచారం పంపిస్తున్నామని, ఈ-క్రాప్ విధానం ద్వారా రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

రైతులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చంద్రబాబు అన్నారు. గత పాలకులు సాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. భూమిని తల్లితో సమానంగా భావించి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పంటల్లో రసాయనాల అవశేషాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో సమస్యలు వస్తున్నాయని సీఎం తెలిపారు. మన ప్రాంతం నుంచి పంపిన మూడు మిర్చి కంటైనర్లను చైనా తిరస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనన్నారు.

ప్రకృతి సేద్యం ఎరువులు, పురుగుమందులకు ప్రత్యామ్నాయమని పేర్కొన్న సీఎం, పల్నాడు జిల్లాలో కొంతమంది రైతులు ప్రకృతి సేద్యం ద్వారా భూమిని కాపాడుతున్నారని అభినందించారు. ఏపీ ప్రకృతి సేద్యంలో దేశంలో ముందంజలో ఉందని, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోందని చెప్పారు. స్విట్జర్లాండ్ నుంచి కూడా ప్రకృతి సేద్యానికి గుర్తింపు లభించిందన్నారు.

వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు, ఆక్వా రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని సీఎం తెలిపారు. కోస్తాంధ్ర ఆక్వా కల్చర్ హబ్‌గా మారిందని, రైతులను పామాయిల్ సాగుకు కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతుల కోసం ఫీడ్ ధరలను తగ్గించేలా ఆదేశాలు ఇచ్చామని, గతంలో మామిడి, పొగాకు రైతులకు ప్రభుత్వం సహాయం అందించిందని వివరించారు.

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. పోలవరం పూర్తైతే గుంటూరు ఛానల్ ద్వారా పల్నాడు ప్రాంతానికి కూడా సాగునీరు అందుతుందని చెప్పారు. గోదావరి నీటిని నల్లమలసాగర్, వంశధార, బనకచర్ల వరకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ప్రతి ఎకరాకు నీరు అందించాలన్న ఎన్టీఆర్ సంకల్పాన్ని నెరవేరుస్తున్నామని సీఎం అన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు.

రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగానికి కూడా పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో తీసుకొచ్చిన ఐటీ విధానాలతో రైతు కుటుంబాల పిల్లలు ఐటీ రంగంలో ఎదిగారని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, డేటా, సెమీ కండక్టర్ రంగాలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని చెప్పారు. డిఫెన్స్, డ్రోన్, ఏరోస్పేస్ పరిశ్రమలు కూడా ఏపీలోకి వస్తున్నాయని, భవిష్యత్తులో 5వ తరం ఫైటర్ జెట్ల తయారీకి అవకాశం ఉందన్నారు.

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని 31 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. గత పాలకులు వదిలిన 131 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించేందుకు రూ.1,300 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, రాష్ట్రంలో 8 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఉందన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛ రథాల ద్వారా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు అవసరమైన వస్తువులు అందిస్తున్నామని తెలిపారు. రహదారుల గుంతలను కూడా దశలవారీగా పూడ్చుతున్నామని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని చెప్పారు. ప్రజలకు సేవలందించడంలో పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మంచి పనితీరు కనబరుస్తున్నాయని సీఎం అభినందించారు. రాష్ట్ర రైతులందరికీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Google: విశాఖ భవిష్యత్తును మార్చే పెట్టుబడి.. గూగుల్ ఏఐ డేటా సెంటర్ చారిత్రాత్మకం.. పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు!

Google: విశాఖ భవిష్యత్తును మార్చే పెట్టుబడి.. గూగుల్ ఏఐ డేటా సెంటర్ చారిత్రాత్మకం.. పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు!

Google: ప్రతిపాదిత గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై వస్తున్న ఆందోళనలు వాస్తవాలపై ఆధారపడలేదని టీడీపీ రాష్ట్ర…

Nara Lokesh: క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి.. ఐటీసీకి మంత్రి లోకేష్ ఆహ్వానం!

Nara Lokesh: క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి.. ఐటీసీకి మంత్రి లోకేష్ ఆహ్వానం!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్ల అభివృద్ధికి పెట్…

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి.. రూ.3,125 కోట్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధం!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి.. రూ.3,125 కోట్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధం!

Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంతో…

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాల…