LIVE
Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  •  TTD Updates: భక్తులకు గుడ్ న్యూస్... రూ. 10,500 అవసరం లేదు.. కేవలం రూ. 120 కే శ్రీవారి దర్శనం!  • 
Andhra Pradesh

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం వంటి రంగాల్లో మలేషియా అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేశారు.

Kasthuri S 1 min read
Malaysia
Malaysia

మలేషియా అభివృద్ధి నమూనాలపై దృష్టి.. అత్యుత్తమ పద్ధతులను ఏపీకి తీసుకురావడమే లక్ష్యం..

బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ సందర్శించిన మంత్రి నారాయణ.. ఆధునిక వ్యర్థాల నిర్వహణపై పరిశీలన..

మలేషియా: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం వంటి రంగాల్లో మలేషియా అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేశారు.

మంత్రి నారాయణ సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్‌ను సందర్శించారు. ఇది మలేషియాలోనే అతిపెద్ద శానిటరీ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడ ఘన వ్యర్థాలను పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలా నిర్వహిస్తున్నారో అధికారులు మంత్రికి వివరించారు.

వ్యర్థాలను పూడ్చిపెట్టే ప్రక్రియలో భూమి, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆధునిక సాంకేతిక విధానాలను మంత్రి పరిశీలించారు. మలేషియాలో అమలు చేస్తున్న ఈ పద్ధతులను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవసరాలకు అనుగుణంగా అమలు చేసే అవకాశాలపై మంత్రి దృష్టి సారించారు.

పర్యటనలో భాగంగా సాయంత్రం బెర్జయ గ్రూప్ నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇళ్ల నిర్మాణంలో ఆ సంస్థ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు.

అలాగే సన్ వే, గముడా ప్రాజెక్టుల ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ రంగాల్లో మలేషియాలోని అనుభవాలను తెలుసుకుని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను రూపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Be the first to react

More Coverage

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాల…