Yogandhra: యోగాంధ్ర 2026లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ప్రజలతో కలిసి యోగాసనాలు!

Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బనగానపల్లెలో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Yogandhra
Yogandhra

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది: మంత్రి..

బనగానపల్లెలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు, యువత..

బనగానపల్లె, నంద్యాల: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బనగానపల్లెలో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగ సాధనలో భాగంగా పలువురు ఆసనాలు చేసి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. యోగ కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను పెంచే గొప్ప జీవన విధానమని అన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని తెలిపారు.

ప్రజల శారీరక, మానసిక ఆరోగ్య వికాసానికి యోగ ఒక అద్భుతమైన సాధనమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగ సాధనను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. యోగాంధ్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగాభ్యాసం చేసేలా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు.

Tags

Be the first to react

Latest