LIVE
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి.. రూ.3,125 కోట్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధం!  •  India-China: డ్రాగన్‌కు భారత్ గట్టి కౌంటర్... అరుణాచల్‌లో రూ. 1.5 లక్షల కోట్లతో మెగా ప్రాజెక్ట్!  •  Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్... క్లారిటీ ఇచ్చిన ఏజీ, ఆ నెలలోనే ఫిక్స్!  •  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బృహత్తర కార్యక్రమం... రూ. 24 కోట్లతో రెండు హెక్టార్లలో 'అరణ్యారామం' భవనానికి శంకుస్థాపన!  •  Sai Krishna Case: సాయికృష్ణ కేసులో సీఎం చంద్రబాబు సీరియస్.. బాధితులకు కీలక హామీ!  •  Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగింపు.. భారత్-అంతర్జాతీయ సంబంధాలపై కీలక చర్చలు!  •  Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  • 
Andhra Pradesh

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లోకి.. రూ.3,125 కోట్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధం!

Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

Kasthuri S 2 min read
Chandra Babu naidu
Chandra Babu naidu

రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల విడుదల..

అన్నదాతకు అండగా ప్రభుత్వం.. తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు..

అమరావతి: రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధులను విడుదల చేయనున్నారు.

ఈ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.3,125.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.782.55 కోట్లను అందిస్తోంది.

లబ్ధిదారుల్లో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తున్న రైతు కుటుంబాలు ఉన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6 వేలు సమకూరుస్తున్నాయి. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నారు.

2026–27 సంవత్సరపు తొలి విడతలో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల చొప్పున అందించనున్నాయి.

గత ఏడాది కూడా ఈ పథకం కింద ప్రభుత్వం భారీగా నిధులు పంపిణీ చేసింది. 2025–26లో మొత్తం రూ.8,985.41 కోట్లను రైతులకు అందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లుగా ఉంది.

రైతులకు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకోనున్నారు.

ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు. అనంతరం 12.30 గంటలకు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

సాయంత్రం 3.50 గంటలకు జరిగే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Be the first to react

More Coverage

Nara Lokesh: క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి.. ఐటీసీకి మంత్రి లోకేష్ ఆహ్వానం!

Nara Lokesh: క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి.. ఐటీసీకి మంత్రి లోకేష్ ఆహ్వానం!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్ల అభివృద్ధికి పెట్…

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాల…

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన.. వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణ విధానాలపై అధ్యయనం!

Malaysia: మలేషియా పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పలు కీలక ప్రాజెక్టులను పరిశ…