⚡ BREAKING

Chaddannam Recipe Telugu: వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్...చద్దన్నం తయారీలో అసలైన పద్ధతి తెలుసా?

Chaddannam Recipe Telugu: వేసవిలో వేడిని తగ్గించి, పొట్టకు హాయినిచ్చే మన సాంప్రదాయ 'చద్దన్నం' తయారీ విధానం మన పూర్వీకులు గంజి, పాలు కలిపి మట్టి పాత్రలో ఎలా తయారు చేసేవారో, దానివల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసం..

Chaddannam Recipe Telugu: వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్...చద్దన్నం తయారీలో అసలైన పద్ధతి

Fermented Rice Benefits: మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి వారు  తినే చద్దన్నమే అని  చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికాలం పిల్లలకు అసలు చెద్దన్నం    తింటారా అనే విషయం కూడా తెలియదు. రాత్రి మిగిలిపోయిన అన్నం  మన శరీరానికి మేలు చేసే ఒక అద్భుతమైన ‘ప్రోబయోటిక్’ ఆహారం. ప్రస్తుతం పెరుగుతున్న ఎండవేడిని తట్టుకోవడానికి, పొట్టకు హాయినిచ్చే ఈ చద్దన్నాన్ని ఈ తరం వారు కూడా  ఇలా చేసుకొని చూడండి అమితంగా  ఇష్టపడతారు. మన పాత తరం  జేజమ్మలు అమ్మమ్మలు ఎగ్జాక్ట్ గా ఈ చద్దన్నాన్ని ఎలా చేసేవారో, ఆ అసలైన పద్ధతిని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

రాత్రి తినగా మిగిలిన అన్నంతోనే చద్దన్నం చేస్తాం కాబట్టి, ఆ రోజు అన్నం వండేటప్పుడే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి వండుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పోస్తే అన్నం మెత్తగా ఉడకడమే కాకుండా, మనకు ఒక కప్పు వరకు గంజి కూడా వస్తుంది. అన్నం బాగా ఉడికిన తర్వాత ఆ గంజిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు ఒక మట్టి గిన్నెలో ఒకటిన్నర కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకుని, అందులో మనం తీసి పెట్టుకున్న చల్లటి గంజిని కలపాలి. మట్టి గిన్నెలో చేయడం వల్ల అన్నం త్వరగా పులియకుండా తినడానికి చాలా కమ్మగా ఉంటుంది.

 ఒక కప్పు గోరువెచ్చని  పాలను అన్నంలో పోయాలి అన్నం చల్లగా ఉండటం వల్ల  పాలు కలవగానే అది తోడుకోవడానికి వీలుగా గోరువెచ్చగా మారుతుంది. కేవలం గంజితోనో లేదా పాలతోనో కాకుండా, ఇలా సగం గంజి  సగం పాలు కలిపి తోడు పెట్టుకోవడం వల్ల చద్దన్నం తిన్నాక కడుపులో భారంగా అనిపించకుండా త్వరగా జీర్ణమవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ పెరుగు తోడు వేసి బాగా కలిపి, ఆ పైన కొన్ని పెద్ద ఉల్లిపాయ ముక్కలు, గాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలను వేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ  పచ్చిమిర్చి ఫ్లేవర్ అన్నానికి పట్టి చాలా రుచిగా వస్తుంది.

ఇలా కలిపి సిద్ధం చేసిన అన్నాన్ని మూత పెట్టి ఒక పది నుండి పన్నెండు గంటల పాటు కదపకుండా పక్కన పెట్టాలి. మనం రాత్రి పడుకోబోయే ముందు ఇలా కలిపి పెట్టుకుంటే, మరుసటి రోజు ఉదయానికి పెరుగు చక్కగా తోడుకుని కమ్మని చద్దన్నం సిద్ధమవుతుంది. తెల్లారాక అన్నం కొంచెం గట్టిగా అనిపిస్తే తగినన్ని నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి. చాలా మంది ఉప్పు లేకుండానే తింటారు, అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రుచి కోసం కొద్దిగా రాళ్ల ఉప్పును పొడిలా చేసి కలుపుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌గా తినడానికి చద్దన్నం ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ వేసవి కాలంలో  వేడి చేయకుండా, పొట్ట మంట లేదా గ్యాస్ వంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ ప్రోబయోటిక్ ఫుడ్‌ను తీసుకోవడం చాలా మంచిది. ఇది తింటే పొట్టకు ఎంతో హాయిగా, చలవగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.  మన పెద్దలు చెప్పిన ఈ పాత పద్ధతిలో చద్దన్నాన్ని ఒకసారి మీరు ట్రై చేయండి మరల మరల ఇదే ఇష్టపడతారు.

Be the first to react

Latest