Machilipatnam: మచిలీపట్నంలో ఘనంగా మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు!
Machilipatnam: రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
పేదలకు అండగా.. విద్యార్థులకు చేయూతగా కొల్లు రవీంద్ర బర్త్డే వేడుకలు..
వేలాది కార్యకర్తల సమక్షంలో సందడిగా మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు..
మచిలీపట్నం: రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
మచిలీపట్నంలోని బందలదొడ్డిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు తోపుడు బండ్లు, నూతన దుస్తులను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు ఎంత సహాయం చేసినా తక్కువేనని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బెగ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. జార్జికారనేషన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు.
రాజుపేట కొత్త మసీదులోని మదర్సాలో మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు కొత్త దుస్తులు అందించారు. చింతచెట్టు సెంటర్లోని జారీ ఆస్థానంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు.
దేశాయిపేట హైస్కూల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి, వారికి పుస్తకాలు, యూనిఫాంలను అందించారు. 26వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కోనేరు సెంటర్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అలాగే హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని విద్యార్థులకు పుస్తకాల కిట్లు పంపిణీ చేశారు. 44వ డివిజన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అన్నదానం ప్రారంభించారు. 50వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి పేదలకు మందులు పంపిణీ చేశారు.
విజయవాడ క్యాంపు కార్యాలయంలో కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎక్సైజ్, మైనింగ్ శాఖ ఉద్యోగుల సమక్షంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనకు మరింత బాధ్యతను పెంచుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తోందని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ఇదే సందర్భంగా మచిలీపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు కంది శ్యామలాదేవి మనుమడు తేజ ప్రమోద రామచంద్ర సాధించిన విజయాన్ని మంత్రి అభినందించారు. ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన హార్ట్ఫుల్నెస్ ప్రీమియర్ లీగ్లో రన్నర్ అప్గా నిలిచిన ప్రమోద రామచంద్రను సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో జరిగిన ఈ వేడుకలు మచిలీపట్నంలో సందడి వాతావరణాన్ని నెలకొల్పాయి.
Tags
Be the first to react