LIVE
NEET: నీట్ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎన్టీఏ కీలక సూచనలు!  •  EPFO UPdates: ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్‌.. ఈపీఎఫ్‌వో 3.0 విప్లవం.. కొత్త పీఎఫ్ సర్వీస్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే!  •  Ongole: ఒంగోలులో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాలు!  •  Modi: ఫ్రెంచ్ వ్యాపార ప్రముఖులతో ప్రధాని మోదీ కీలక సమావేశాలు!  •  Minister Narayana: ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం కోసం మలేషియాకు చేరుకున్న మంత్రి నారాయణ!  •  Himachal: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి వేచి ఉన్న భక్తులు!  • 
Andhra Pradesh

Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!

Chandrababu: రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అనుకూలంగా పంటల సాగు విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Kasthuri S 2 min read
Chandrababu
Chandrababu

ప్రకృతి సేద్యం విస్తరణ, డిమాండ్ ఉన్న పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం..

ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించేలా కార్యాచరణ: సీఎం..

రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అనుకూలంగా పంటల సాగు విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

అమరావతి సచివాలయంలో వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఎదురైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటలపై సరైన సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని, దీనిపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.

రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని ముఖ్యమంత్రి తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు సాగు చేసే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి వంటి పంటల ఉత్పత్తి, మార్కెట్ పరిస్థితులపై సీఎం అధికారులతో చర్చించారు. పొగాకు కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పంటలను నిల్వ చేసుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.

ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు మంచి ఆదాయం వచ్చేలా మార్కెట్ అవసరాలను అంచనా వేసి సాగు విధానాలను రూపొందించాలని అన్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్పత్తులతో పాటు సాగు దశలో ఉన్న పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషించి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో అదనపు విలువను పెంచే విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు.

ఆక్వా రంగంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆక్వా రైతులు, సంఘాల ప్రతినిధులు, ఆక్వా ఫీడ్ తయారీదారులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెంచేలా, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

High Court: ఏపీలో చర్చనీయాంశంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు!

High Court: ఏపీలో చర్చనీయాంశంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు!

High Court:: ఆంధ్రప్రదేశ్‌లో గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. సాయికృష్ణ ఎ…

Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

Chandrababu: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ప్రతి ప్రభుత్వ…