LIVE
ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  • 
Andhra Pradesh

Singapore: సింగపూర్‌లో యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ పట్టణాభివృద్ధిపై కీలక చర్చలు!

Singapore: సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో సీఎం భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర పట్టణాభివృద్ధి, నగరాల ప్రణాళికపై చర్చించారు.

Kasthuri S 2 min read
Singapore
Singapore

సుస్థిర పట్టణ అభివృద్ధికి యూఎన్ హాబిటాట్ సహకారం కోరిన సీఎం చంద్రబాబు..

ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన..

సింగపూర్: సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో సీఎం భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర పట్టణాభివృద్ధి, నగరాల ప్రణాళికపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో యూఎన్ హాబిటాట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కోరుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. దీనికి యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

పట్టణాల సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం, ప్రణాళికల రూపకల్పనలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) చేర్చడం, నిపుణుల నెట్‌వర్క్ సహకారం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

2028 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇందుకోసం యూఎన్ హాబిటాట్‌తో అవగాహన ఒప్పందం (MoU) ద్వారా కాలపరిమితితో కూడిన ప్రణాళిక ఉండాలని తెలిపారు.

తీర ప్రాంత నగరాలను వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి రక్షించేందుకు రూపొందించిన ‘రైజప్’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక మెరుగుపరిచేందుకు సహకారం అందించాలని కోరారు.

నగరాల్లో మురికివాడల అభివృద్ధి కోసం పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రామ్ (PSUP) అమలుపై కూడా చర్చ జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరాల్లో అర్బన్ రాస్తా ఫ్రేమ్‌వర్క్‌ను సంయుక్తంగా అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. నగరాల రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక ఆదాయ వనరులను పెంచేందుకు వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ వంటి విధానాలను ప్రవేశపెట్టడం, అంతర్జాతీయ వాతావరణ నిధులను సమీకరించడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ నగరాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో సుస్థిర పట్టణాభివృద్ధికి బాటలు వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Be the first to react

More Coverage