LIVE
Nara Lokesh: కోల్‌కతాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం!  •  Weight Loss: చుక్క నూనె లేకుండా నోరూరించే చికెన్ కర్రీ.. బరువు తగ్గడానికి బెస్ట్ డైట్!  •  Land Regestraions: బిగ్ అలర్ట్.. ఆ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్!  •  Talliki Vandanam: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు... లోకేష్ కీలక ఆదేశాలు!  •  AP Development: మైసూర్ జేఎస్‌ఎస్ సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ... భూసేకరణ షురూ!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!  •  APSDMA: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసిన APSDMA!  •  Movie Review: ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ... అమ్మ జీవితానికి రెండో అవకాశం.. హృదయాలను కదిలిస్తున్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం!  •  TTD Updates: భక్తులకు గుడ్ న్యూస్... రూ. 10,500 అవసరం లేదు.. కేవలం రూ. 120 కే శ్రీవారి దర్శనం!  • 
Employment

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఇకపై ఏటీఎం, యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్ విత్‌డ్రా!

EPFO: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ‘ఈపీఎఫ్ఓ 3.0’ ద్వారా జూన్ నెలాఖరు నుండి పీఎఫ్ ఖాతాదారులు ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా నేరుగా యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు సర్వర్ బ్లాక్‌అవుట్ ప్లాన్ చేశారు. కొత్త రూల్స్ ప్రకారం ఆటో సెటిల్‌మెంట్ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెరిగింది.

Yoshitha D 2 min read
పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్
పీఎఫ్ ఖాతాదారులకు బంపర్ ఆఫర్
  • 75 శాతం పీఎఫ్ బ్యాలెన్స్ యూపీఐ ద్వారా విత్‌డ్రా.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఇవే!

  • ముగిసిన ట్రయల్స్.. పీఎఫ్ ఖాతాదారులకు డిజిటల్ గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి మన్సుఖ్!

  • ఆధార్, పాన్ లింక్ ఉంటే చాలు.. 20 రోజుల నిరీక్షణ లేకుండా నిమిషాల్లో పీఎఫ్ సొమ్ము సొంతం!

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఏడు కోట్ల మందికి పైగా ఉన్న చందాదారులకు భారీ ఊరటనిస్తూ సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేపింది. ‘ఈపీఎఫ్ఓ 3.0’ (EPFO 3.0) డిజిటల్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఇకపై పీఎఫ్ ఖాతాదారులు ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా, కంపెనీ యజమానుల ప్రమేయంతో పనిలేకుండా నేరుగా యూపీఐ (UPI) లేదా ఏటీఎం (ATM)ల ద్వారా తమ పీఎఫ్ డబ్బులను ఇన్‌స్టంట్‌గా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ జూన్ నెలాఖరు నుంచే ఈ సరికొత్త నిబంధనలు అమలు కానున్నాయని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ సరికొత్త విధానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ధృవీకరించారు. కొత్త సిస్టమ్ ప్రకారం.. పీఎఫ్ చందాదారులు ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా తమ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుని, అక్కడే ఒక సురక్షితమైన క్యూఆర్ (QR) కోడ్‌ను జనరేట్ చేసుకోవచ్చు. ఆ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా ఈపీఎఫ్ఓ అనుసంధానించే ప్రత్యేక ఏటీఎం కార్డులను ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో నేరుగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా విత్‌డ్రా చేసిన సొమ్ము నేరుగా సభ్యుడి బ్యాంక్ ఖాతాకే బదిలీ అవుతుంది.

సాంకేతిక మార్పులతో పాటు విత్‌డ్రా పరిమితుల్లో కూడా కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ 3.0 నిబంధనల ప్రకారం, ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని గతంలో ఉన్న రూ. 1 లక్ష నుండి ఏకంగా రూ. 5 లక్షల వరకు పెంచారు. ఉద్యోగులు అత్యవసర సమయాల్లో తమ పీఎఫ్ నిల్వ నుండి గరిష్టంగా 75 శాతం వరకు నిధులను యూపీఐ ద్వారా ఇన్‌స్టంట్‌గా పొందే వీలుంటుంది. అయితే రిటైర్మెంట్ అవసరాల కోసం పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం నిల్వను ఎల్లప్పుడూ ఉంచాలనే నిబంధనను కూడా ఇందులో చేర్చారు.

ఈ భారీ డిజిటల్ మార్పులను సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడానికి మరియు సరికొత్త '2.01 సర్వర్'ను లైవ్‌లోకి తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో దాదాపు మూడు రోజుల పాటు ఈపీఎఫ్ఓ సర్వర్ల బ్లాక్‌అవుట్ (తాత్కాలిక నిలిపివేత) జరగనుంది. ఈ మూడు రోజుల పాటు సాఫ్ట్‌వేర్ పరంగా ఉన్న చిన్నచిన్న సాంకేతిక ఇబ్బందులను సరిచేసి, కొత్త సేవలను పూర్తిగా అనుసంధానించనున్నారు. ఈ సర్వర్ అప్‌గ్రేడ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే దేశవ్యాప్తంగా యూపీఐ-ఏటీఎం విత్‌డ్రా సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఈ డిజిటల్ సేవలను భక్తులు లేదా వినియోగదారులు సజావుగా వినియోగించుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. ఖాతాదారుల యూఏఎన్ (UAN) యాక్టివ్‌గా ఉండటంతో పాటు, దానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు సరైన ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్‌తో కూడిన బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. ఈ అప్‌గ్రేడ్ ద్వారా గతంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు పట్టే 7 నుండి 20 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తప్పనుంది. దాదాపు 95 శాతం క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా క్షణాల్లో ప్రాసెస్ అయి నేరుగా చేతికి అందుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Chandrababu

Chandrababu: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బ్యాంకులు సహకరించాలి.. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగంగా సాగేందుకు బ్యాంకులు తమ వంతు సహకారం అందించాల…