LIVE
PM Kisan 23rd installment: రైతన్నల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. 23వ విడతను విడుదల చేసిన ప్రధాని మోదీ! ఇలా చెక్ చేసుకోండి!  •  Machilipatnam: మచిలీపట్నంలో ఘనంగా మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు!  •  Road Extension: అమరావతి కేవలం 5 గంటల్లోనే... నాలుగు వరుసలుగా మారనున్న జాతీయ రహదారి విస్తరణ!  •  హిందీ మాట్లాడటం నేర్చుకుంటే మంచి భవిష్యత్తు! రాష్ట్ర వ్యాప్త బాలల ‘హిందీ టాలెంట్' పురస్కారాల ప్రదానం!  •  Singapore: సింగపూర్‌లో తెలుగు వారందరికీ TDFS ప్రత్యేక ఆహ్వానం... మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ఆత్మీయ సమావేశం!  •  Weather Report: ఏపీ ప్రజలకు అలర్ట్... ఈ 15 జిల్లాలకు వర్ష సూచన! గంటకు 50 కిలోమీటర్ల వేగంతో...  •  Transit Visa: భారతీయులకు బంపర్ ఆఫర్... ట్రాన్సిట్ వీసా అవసరం లేకుండానే ఆ దేశం చుట్టి రావచ్చు!!  •  Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్.. కొండెక్కిన బంగారం ధరలు! తులం ఎంతంటే...  •  Tunnel Roads: నగరంలో భూగర్భ టన్నెల్ రోడ్లు... ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, మంత్రి కీలక ప్రకటన!  •  Amaravati Green City: నీలి, హరిత నగరంగా అమరావతి... 34 రాచమార్గాలకు ఇరువైపులా రంగురంగుల పూలవనం!  • 
⚡ BREAKING
Media

హిందీ మాట్లాడటం నేర్చుకుంటే మంచి భవిష్యత్తు! రాష్ట్ర వ్యాప్త బాలల ‘హిందీ టాలెంట్' పురస్కారాల ప్రదానం!

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఛైర్మన్ శ్రీ పోతుల బాలకోటయ్య గారు, శ్రీ సిహెచ్. రాజశేఖర్ గారు ( కోఆర్డినేటర్, NRI TDP Cell ) మరియు శ్రీ జి. శ్రీకాంత్ గారు (స్టేట్ డైరెక్టర్, ఏపీ సోషల్ ఆడిట్, Govt of AP) మరియు తదితరులు హాజరయ్యారు.

Yoshitha D 2 min read
హిందీ టాలెంట్ పురస్కారాల ప్రధానం
హిందీ టాలెంట్ పురస్కారాల ప్రధానం
  • విజయవాడలో వైభవంగా 'విశిష్ట హిందీ ప్రతిభారత్న పురస్కార' వేడుక

  • హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో విజేతలకు పురస్కారాల పంపిణీ: పండుగలా మారిన UTF భవన్

హిందీ సేవా సదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో శనివారం (20 జూన్ 2026) విజయవాడలోని బీసెంట్ రోడ్డు, రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న UTF భవన్ లో "హిందీ టాలెంట్ టెస్ట్ - 2025" రాష్ట్రస్థాయి విజేతల పురస్కార ప్రదాన ఉత్సవం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తరగతుల వారిగా రెండు విడతలలో హిందీ పోటీ పరీక్షలను నిర్వహించడం జరిగినదని, మొదటి విడతలో వారి వారి పాఠశాల మరియు కళాశాల స్థాయిలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులను రెండవ విడతలో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, విజేతలకు ఈ వేదికపై "విశిష్ట హిందీ ప్రతిభారత్న పురస్కారం" (నగదు పురస్కారం, జ్ఞాపిక మరియు సర్టిఫికెట్) అందజేశారు.

26 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు నగదు బహుమతులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఛైర్మన్ శ్రీ పోతుల బాలకోటయ్య గారు, శ్రీ సిహెచ్. రాజశేఖర్ గారు ( కోఆర్డినేటర్, NRI TDP Cell ) మరియు శ్రీ జి. శ్రీకాంత్ గారు (స్టేట్ డైరెక్టర్, ఏపీ సోషల్ ఆడిట్, Govt of AP) మరియు తదితరులు హాజరయ్యారు.

ఈ సమగ్ర కార్యక్రమ నిర్వహణను కేంద్ర ఆర్థిక శాఖ (భారత ప్రభుత్వం) హిందీ సలహా మండలి సభ్యులు శ్రీ కోనే శ్రీధర్ గారు ప్రణాళికాబద్ధంగా నిర్వహించి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

ప్రతిభావంతులైన విద్యార్థులకు

కాగా,

శ్రీ పోతుల బాలకోటయ్య గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా హిందీ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభావంతులైన 26 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బాలకోటయ్య గారు మాట్లాడుతూ, జాతీయ భాష అయిన హిందీని అభ్యసించడం వల్ల దేశవ్యాప్తంగా మెరుగైన అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు హిందీ సేవా సదన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. 

కోఆర్డినేటర్ NRI TDP Cell  చప్పిడి రాజశేఖర్ గారు మాట్లాడుతూ విద్యార్థులను అభినందించి హిందీ పరీక్షను రాయటం, చదవడం మాత్రమే కాకుండా బాగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలని, అలా నేర్చుకోవడం వలన ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రదేశంలోనైనా రాణించగలుగుతారని తెలిపారు. శ్రీ జి. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు భాషా నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు విద్యార్థులను అభినందించారు. 

ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ జె. వెంకట రామ్ నరసింహారెడ్డి గారు (సీనియర్ హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్) గారు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇలాంటి పురస్కారాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. శ్రీ శృతికాంత్ భారతి గారు (సభ్యులు, కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ హిందీ సలహా మండలి) గారు కేంద్ర ప్రభుత్వం హిందీ భాషాభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడారు. శ్రీ ఎస్. గిరిధర్ రావు గారు (ప్రముఖ హిందీ రచయిత, గుంటూరు) సాహిత్యపరంగా హిందీ భాషా సౌందర్యాన్ని విద్యార్థులకు వివరించారు.

హిందీ సేవా సదన్ స్టేట్ కన్వీనర్లు శ్రీ కె. ఇంతియాజ్ గారు, శ్రీ హాజీ కరీం గారు విచ్చేసిన అతిథులకు, పురస్కార గ్రహీతలకు, వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన విజేతలతో UTF భవన్ కిక్కిరిసిపోయి, పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సభకు హిందీ సేవా సదన్ వ్యవస్థాపకులు, కేంద్ర సహకార, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖల (భారత ప్రభుత్వం) హిందీ సలహా మండలి సభ్యులు అయిన శ్రీ ఎస్. గైబువల్లి గారు అధ్యక్షత వహించారు. సభకు విచ్చేసిన అతిధులకు, విద్యార్థుల తరపున వచ్చిన టీచర్లను, తల్లిదండ్రులను నిర్వాహకులు మరియు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

1 readers have reacted

More Coverage

Baba Ramdev: ‘చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్’.. ఉండవల్లి గుహల సాక్షిగా బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Baba Ramdev: ‘చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్’.. ఉండవల్లి గుహల సాక్షిగా బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Baba Ramdev: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘…

pm-modi-releases-rd-installment-of-pm-kisan-funds

PM Kisan 23rd installment: రైతన్నల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. 23వ విడతను విడుదల చేసిన ప్రధాని మోదీ! ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan 23rd installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో భాగంగా 23వ విడత ని…

america-instead-of-gulf-india-new-paths-for-lpg-oil-companies-in-huge-losses

Iran War: గల్ఫ్‌కు బదులు అమెరికా.. ఎల్‌పీజీ కోసం భారత్ కొత్త దారులు.. భారీ నష్టాల్లో చమురు సంస్థలు

Iran War: పశ్చిమాసియాలో ఇటీవల చెలరేగిన సంక్షోభం, భారతదేశ ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) దిగుమ…

Chandra Babu Naidu

Chandrababu: రైతులకు అండగా ప్రభుత్వం.. అభివృద్ధి, ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం.. సీఎం చంద్రబాబు హామీ!

Chandrababu: పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం అనంతరం లింగంగుంట్లలో జరిగిన సభలో ముఖ…