ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 43వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళి

44. ఓం సర్వ కామఫల ప్రదాయై నమః

అర్థం: కామం అంటే కోరిక. కామ ఫలాలు అంటే మనం కోరుకునే ఫలితాలు. సంపద కోసం, అధికారం కోసం, ఉద్యోగం కోసం, పుత్రుల కోసం - ఇట్లా   తమ కోర్కెలు నెరవేరటానికై, స్వభావానుగుణంగా, భక్తి శ్రద్ధలతో వివిధ దేవతారూపాలను ఆరాధిస్తుంటారు. ఇది సకామ భక్తి.

సకామ భక్తులకు ఆ భక్తి శ్రద్ధలను ఇచ్చినదీ నేనే, ఆయా దేవతల ద్వారా వారి కోర్కెలను నెరవేర్చేది నేనే అని శ్రీమద్భగవద్గీతలో పరమాత్మ అంటున్నారు. వారు పొందే సుఖసంతోషాలు ఏవైనా అవి తాత్కాలికాలే అని చెపుతున్నారు. ఎందువలన అంటే కోరికలకు అంతు లేదు. అవి సముద్రంలో అలల వంటివి. ఒక దాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. సుఖభోగాలు ఎన్ని అనుభవించినా తృప్తి ఉండదు. ఇంకా ఏదో వెలితి ఉంటూనే ఉంటుంది. అది తీరని దాహం. కాబట్టి లౌకికమైన కోర్కెల వలన లభించే సుఖాలు నిత్యమైనవి కావు. నిండైనవి కావు. మరి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖ సంతోషాలు పొందాలంటే నిత్యుడైన పరిపూర్ణుడైన పరమాత్మ ద్వారానే సాధ్యం.

ధర్మావిరుద్ధో భూతేషు కామో-స్మి । 7.11 

అర్థం: ప్రాణులలో ధర్మవిరుద్ధం కాని కోర్కెను నేనే అంటున్నారు పరమాత్మ. నీకు హితకరమైన కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు ఫలప్రదం అవుతాయి అని చెపుతున్నారు. నన్ను ఆశ్రయించిన భక్తులు వారు కోరుతున్న ఫలాలు పొందటమే కాక చివరకి నన్నే పొందగలరు అంటున్నారు.

మానవుడు సాధించవలసిన పురుషార్థాలు నాలుగు. ధర్మార్థ కామ మోక్షాలు. వీటిలో ధర్మం మొదటిది. కనుక ఏ పురుషార్థం సాధించాలన్నా ముందుగా అది ధర్మబద్ధమా కాదా అనేది నిశ్చయించుకోవాలి. గీతలో పరమాత్మ బోధ ప్రకారం జీవితం తీర్చిదిద్దుకొనేటప్పుడు ధర్మబద్ధమైన మన కోర్కెలు అప్రయత్నంగానే ఫలిస్తాయి. నాకు హితకరమైన మహా ఫలాలను ప్రసాదిస్తున్న గీతామాతకు నిండు మనస్సుతో నమస్కృతి సమర్పిస్తున్నాను.        

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 43 : Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

నామం 42 : Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!

నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!

నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!

నామం 39 : Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!

నామం 38 : Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

నామం 37 : Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!

నామం 35 : Bhagavad Gita : బాహ్య సుఖం తాత్కాలికం ఆత్మసుఖమే నిత్యమైనది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -35!

నామం 34 : Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

నామం 33 : Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

నామం 27 : Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!

నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

నామం 25 : Bhagavad Gita: భగవద్గీతలోని త్రిమూర్తి రహస్యం.. సృష్టి, స్థితి, లయకు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -25!

నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!

నామం 23 : Bhagavad Gita: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని ఉపదేశం.. మానవాళికీ మార్గదర్శనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా23!

నామం 22 : Bhagavad Gita: మహాపాపిని మహాత్మునిగా మార్చగల శక్తి గీత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-22!

నామం 21 : Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా!

నామం 20 : Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!

నామం 19 : Bhagavad Gita: దేహం నశించేది దేహి నాశనం లేనివాడు, నిత్యుడు.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 19!

నామం 18 : Bhagavad Gita: కురుక్షేత్ర సంగ్రామం జీవిత సమరానికి ప్రతీక.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-18!

నామం 17 : Bhagavad Gita: జీవి మూలం, గమ్యం, ఉద్దేశ్యం తెలుసుకోవటం జ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -17!

నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!