Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ వేగం పుంజుకుంది.. 46% పనులు పూర్తయ్యాయి!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వన్‌ప్లస్ కంపెనీ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమవుతోంది. కొత్తగా “వన్‌ప్లస్ ఏస్ 6 (OnePlus Ace 6)” పేరుతో శక్తివంతమైన మొబైల్ ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్‌ను కంపెనీ అల్ట్రా-పెర్ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్ డివైజ్గా అభివర్ణించింది. మొదటగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. అనంతరం భారత మార్కెట్‌లో దీని రీబ్రాండెడ్ వెర్షన్‌ను “OnePlus 15R” పేరుతో విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఈ కొత్త డివైజ్‌లో అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన పనితీరు, మరియు నూతన డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Boeing 777: పక్షుల గుంపు ఢీకొట్టిన Boeing 777.. పైలట్ సమయస్ఫూర్తితో సేఫ్ ల్యాండింగ్!

వన్‌ప్లస్ ఏస్ 6లో 6.83 ఇంచుల BOE OLED డిస్‌ప్లే ఇవ్వబడనుంది. ఇది 1.5K రిజల్యూషన్తో వస్తుంది మరియు 165Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అంటే యూజర్లు తమ అవసరానికి అనుగుణంగా 60Hz, 90Hz, 120Hz, 144Hz, 165Hz లలో ఏదైనా రిఫ్రెష్ రేట్ ఎంచుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనుల్లో ఇది అత్యంత స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. డిస్‌ప్లేలో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ను కూడా పొందుపరుస్తున్నట్టు సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా వేగంగా, కచ్చితంగా లాక్ అన్‌లాక్ చేయవచ్చు.

Suryalanka Nizampatnam : తుపాన్ ప్రభావం తీవ్రం.. సూర్యలంక నిజాంపట్నం బీచ్లు తాత్కాలికంగా మూసివేత!

ఈ ఫోన్‌లో వన్‌ప్లస్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ను ఉపయోగిస్తోంది. ఇది ప్రస్తుతానికి మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌లలో ఒకటి. గేమింగ్‌కి, హెవీ మల్టీటాస్కింగ్‌కి ఈ చిప్‌సెట్ అసాధారణ వేగాన్ని అందిస్తుంది. ఫోన్ మిడిల్ మెటల్ ఫ్రేమ్ డిజైన్తో వస్తోంది. దీని వల్ల లుక్ స్టైలిష్‌గా, బిల్డ్ క్వాలిటీ రాబస్టుగా ఉంటుంది. అదనంగా, ఫోన్ IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్తో వస్తున్నందున నీటి చుక్కలు లేదా ధూళి ప్రభావం దాదాపు ఉండదు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 16 ఆధారంగా నడుస్తుంది, అంటే కొత్త ఫీచర్లు, మెరుగైన సెక్యూరిటీ, మరియు వేగవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

జుట్టు ఫాస్ట్‌గా పెరగాలంటే.. గోల్డెన్ రూల్స్ ఇవే! కచ్చితంగా పాటించాల్సిన 9 చిట్కాలు!

ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం వన్‌ప్లస్ ఏస్ 6లో 50MP ప్రైమరీ + 8MP అల్ట్రా వైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. ఈ కెమెరా వ్యవస్థతో ల్యాండ్‌స్కేప్‌లు, పోర్ట్రెయిట్లు, వీడియోలు అన్నీ హై క్వాలిటీగా రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో 7,800mAh భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీని కోసం 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది — అంటే కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తి చార్జ్ అవుతుంది. కలర్స్ విషయానికొస్తే బ్లాక్, ఫ్లాష్ వైట్, సిల్వర్ మూడు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. మొత్తం బరువు సుమారు 213 గ్రాములు. లాంచింగ్ ధర సుమారు ₹40,000 వరకు ఉండొచ్చని అంచనా. ఈ రేంజ్‌లో ఇంత ఫీచర్లు ఇచ్చే ఫోన్ వన్‌ప్లస్ నుంచి రావడం యూజర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Elevated Rail Corridor: దక్షిణ మధ్య రైల్వే కొత్త మెగా ప్రాజెక్టు! గంటకు 350కి.మీ వేగం... ఇక గంటన్నర లో హైదరాబాద్!
ఈ రీఛార్జ్‌తో 3 నెలల పాటు OTT సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ! 168GB డేటా ఉచితం - 84 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో సంచలనం – అందరికీ అందుబాటులో 5జీ ఫోన్! ధర తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!
'మొంథా' తుపాను ముప్పు.. రాత్రికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.. తీరం వైపు దూసుకొస్తోంది! గంటకు 6 కి.మీ వేగంతో..
అధిక రేంజ్ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్.. 123 కి.మీ. రేంజ్‌తో నగర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్! రంగును బట్టి రిజ్టా ధరలు వేరు!
Rock Garden: చిన్న పిల్లల నుంచి పెద్ద వయస్సు వారిని ఆకర్షిస్తున్న ప్రకృతి అందాల రాక్ గార్డెన్! తప్పక చూడండి!