ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 40వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
41. ఓం సాంఖ్యబుద్ధి ప్రదాయై నమః
అర్థం: సంఖ్యతో కూడినది సాంఖ్యము. జ్ఞాన విచారణలో ఆత్మానాత్మ వస్తువులను లెక్కించేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది. ప్రకృతిలోని 24 తత్త్వాలను లెస్సగా తెలుసుకొని, అవి అనాత్మ రూపాలని గుర్తించి, వాటిని త్యజించి, వాటికి సాక్షిగా ఉన్నట్టి పరమాత్మను గ్రహించటమే సాంఖ్యవిద్య. ఆత్మానాత్మ వివేక రూపమైన విజ్ఞానమే సాంఖ్యము. దేహం నుండి దేహిని విడగొట్టి చూపేదే సాంఖ్యము.
భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్య యోగం. పంచభూతాత్మకమైన దేహాదుల యొక్క నశ్వరత్వం (నాశనమయ్యే స్వభావం) దీనిలో ప్రతిపాదించబడింది. జ్ఞాన సంబంధమైన అంశాలు విశేషంగా వివరించబడ్డాయి. ఆత్మ స్వరూపం చక్కగా వర్ణించబడినది. కనుక దీనికి సాంఖ్య యోగం అనే పేరు సార్ధకమైంది. సాంఖ్య యోగంలో ‘అశోచ్యాన్ అన్వశోచః ...’ (శోకింపదగని వానిని గూర్చి శోకించావు) అనే శ్లోకం గీతాశాస్త్రానికి బీజమని చెపుతారు. అసత్యములైనట్టి దేహాదులకు ఉనికి లేదు. సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. దేహి నిత్యుడు. దేహములు అనిత్యాలు. ఆత్మకు వినాశం లేదు.
అంతవంత ఇమే దేహా
నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినో-ప్రమేయస్య
తస్మాద్యుధ్యస్వ భారత ॥ 2.18
ఈ దేహాలు నశించి పోయేవి. దేహంలో ఉన్న దేహి (ఆత్మ) ఎప్పుడు ఉండేవాడు. నిత్యుడు, నాశరహితుడు, అప్రమేయుడు.
ఒక వేళ నీవు, ఆత్మ పదే పదే జనన మరణాలకు లోనవుతుంది అనుకున్నా పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికై నీవు శోకింపవలదు (న త్వం శోచితుమర్హసి) అని పరమాత్మ సాంఖ్య యోగంలో అర్జునుడికి వివరించారు. సాంఖ్యజ్ఞానం యథార్ధమైన ‘నేను’ ఎవరో తెలియజేస్తుంది. ఆత్మజ్ఞానం కలిగిన పిమ్మట ఆత్మికబుద్ధితో కర్మలు చేస్తూ, ఆత్మ స్వరూపంగా ఉండమని ఆశీర్వదిస్తుంది గీతామాత.
ఆత్మవాన్ భవ అనే ఈ శుభకరమైన ఆశీర్వచనమే భవఘ్ని ఆరామంలో అడుగిడగానే మనకు కనువిందు చేస్తుంది. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకం కలిగించి, సాంఖ్యబుద్ధి ప్రసాదించిన గీతామాతకు ధన్యవాదంతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!