LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి తాజాగా మంచి అవకాశాన్ని ప్రకటించింది. సంస్థలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 121 పోస్టులు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఇందులో ప్రొఫెసర్, అదనపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి గరిష్టంగా నెలకు రూ.1,68,900 వరకు వేతనం అందజేయనున్నారు.

NCC కి సీసీఎల్ నుంచి రూ.6,829 కోట్ల మైనింగ్ ఆర్డర్! స్థానిక ఉపాధి అవకాశాలు!

ప్రొఫెసర్ పదవికి 10 పోస్టులు, అదనపు ప్రొఫెసర్‌కి 8 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్‌కి 20 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి 83 పోస్టులు కేటాయించారు. ఈ నియామకాలు పూర్తిగా రెగ్యులర్ పద్ధతిలో నిర్వహించబడతాయి. మంగళగిరిలోని AIIMS లో ఇప్పటికే పలు విభాగాల్లో వైద్య విద్య, పరిశోధన, వైద్యసేవలు అందిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నియామకాలు సంస్థ కార్యకలాపాలను మరింత బలపరుస్తాయని అధికారులు తెలిపారు.

“సార్ మిమ్మల్ని కలవాలనుంది, అపాయింట్‌మెంట్ ఇస్తారా?” గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!

అభ్యర్థులు MBBS, MS, MD, MCh వంటి అర్హతలతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. గరిష్ట వయసు 58 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ నియమాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, PwBD మరియు ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపులు ఉన్నాయి.

Upliance AI: కూరగాయలు కట్ చేయడం నుంచి సాంబార్ వండేవరకు – అన్నీ చేసే స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్! ధర ఎంతంటే!

వేతనాలు 7వ వేతన కమిషన్ ప్రకారం నిర్ణయించబడ్డాయి. ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900, అదనపు ప్రొఫెసర్‌కి రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కి రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి రూ.1,01,500 నెలకు వేతనం అందుతుంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాలి. జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.3,100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.2,100 ఫీజు ఉండగా, PwBD అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంది.

AP Healthcare : ఆరోగ్య రథం ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు, ప్రతి ఇంటి వద్ద ఉచిత వైద్యం!

ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్య, అనుభవ సర్టిఫికేట్లను తప్పనిసరిగా సమర్పించాలి. అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాతే ఫీజు చెల్లింపు ఆప్షన్ యాక్టివ్ అవుతుంది. ఇంటర్వ్యూ తేదీలు తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు aiimsmangalagiri.edu.in/vacancies వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

OnePlus Ace 6: వన్‌ప్లస్ నుంచి కొత్త ప్రీమియం ఫోన్! స్మార్ట్‌నెస్‌ అన్నీ ఒకే ప్యాక్‌లో..!
Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ వేగం పుంజుకుంది.. 46% పనులు పూర్తయ్యాయి!
Boeing 777: పక్షుల గుంపు ఢీకొట్టిన Boeing 777.. పైలట్ సమయస్ఫూర్తితో సేఫ్ ల్యాండింగ్!
Suryalanka Nizampatnam : తుపాన్ ప్రభావం తీవ్రం.. సూర్యలంక నిజాంపట్నం బీచ్లు తాత్కాలికంగా మూసివేత!
జుట్టు ఫాస్ట్‌గా పెరగాలంటే.. గోల్డెన్ రూల్స్ ఇవే! కచ్చితంగా పాటించాల్సిన 9 చిట్కాలు!