ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 40వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
40. ఓం ఆత్మానుభూతి ప్రదాయై నమః
అర్థం: ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే ఆత్మానుభూతి. ఆత్మజ్ఞానం పొందటానికి సాధన చతుష్టయ సంపత్తి (నాలుగు విధాలయిన సాధన సంపద) అవసరం అని శంకర భగవత్పాదులు ‘వివేకచూడామణి’లో చెప్పారు.
1. నిత్యానిత్య వస్తు వివేకము : ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకోవటం.
2. ఇహాముత్ర ఫలభోగ విరాగము : ఇహలోక, పరలోక భోగాల యెడల విరక్తి.
3. శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధి, శ్రద్ధ అనే ఆరు గుణాలు కలిగి ఉండటం.
4. ముముక్షుత్వం : మోక్షమునందు కోరిక.
ఈ నాలుగు గుణాలు గలవారు ఆత్మబోధ / జ్ఞానం పొందటానికి యోగ్యులని శంకర భగవత్పాదులు చెప్పారు. ఆత్మజ్ఞానం లేనిదే సంసార క్లేశంనుండి విముక్తి కలగదు. అగ్ని లేకుండా వంట చెయ్యగలమా? అదే విధంగా ఆత్మజ్ఞానం లేకుండా విముక్తం కాలేము.
దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము - వీటన్నిటికి అతీతం అయినది ఆత్మ స్వరూపం. అది దేహము, ఇంద్రియాలు, మనస్సు మొదలైన వాటి పనులకు సాక్షి. ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని నిరాకరిస్తూ, చిట్టచివరికి ‘ఆ పరమాత్మనే నేను’ అని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం. ‘అహం బ్రహ్మాస్మి.’ అవిద్యతో (అజ్ఞానం) ఈ స్థూల దేహం నశిస్తుంది. అది నీటి బుడగ వలె క్షణభంగురం. కానీ ఆత్మ స్వరూపమైన నేను మరణించేవాడిని కాదు. నేను శాశ్వతుడను.
జ్యోతిషామపి తజ్జ్యోతిః
తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 13.18
అర్థం: పరమాత్మ సూర్యచంద్రాది జ్యోతి స్వరూపాలకు సైతం ప్రకాశం ఇచ్చేది, అజ్ఞాన తమస్సుకు అతీతమైనది, చిన్మయ స్వరూపమైనది, తెలియదగినది, జ్ఞాన గుణాలచే పొందదగినది. సర్వవ్యాప్తంగా ఉన్న పరమాత్మ సమస్త ప్రాణుల హృదయాల్లోను విశిష్టంగా నెలకొని ఉన్నది.
కనుక జ్యోతిరూపంలో నీ హృదయంలోనే ఉన్న ఆత్మ స్వరూపాన్ని స్పష్టంగా నీలోనే అనుభవానికి తెచ్చుకోవచ్చు. సాక్షి చైతన్య స్వరూపంగా, సర్వగతంగా, నిరాకారంగా ఉన్న నా తండ్రిని నా హృదయంలోనే దర్శింపజేసి, పరమాత్మ బిడ్డగా, ఆయన అంశగా ఆత్మానుభూతిని కలుగజేసిన గీతామాతకు ఆత్మానందంతో నమస్కరిస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!
నామం 29 : Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
నామం 28 : Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!
నామం 26 : Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!
నామం 24 : జీవాత్మ నుండి పరమాత్మ వరకు గీతా ప్రబోధం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -24!
నామం 16 : Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!
నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!