ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇప్పుడు మన జీవితంలోని ప్రతి రంగాన్నీ తాకుతోంది. ఇప్పుడు అది వంటగదిలోకి కూడా ప్రవేశించింది. Upliance AI అనే సరికొత్త స్మార్ట్ కుకింగ్ డివైజ్ వంటను మరింత సులభం, వేగంగా చేయడం మాత్రమే కాదు, మీకు నచ్చినట్టు వంట కూడా చేసి పెడుతుంది. భారతదేశంలో మొదటి ఏఐ ఆధారిత కుకింగ్ అసిస్టెంట్‌గా ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ డివైజ్ కూరగాయలు కట్ చేయడం, మసాలా దినుసులు కలపడం, ఫ్రై చేయడం, బాయిల్ చేయడం వంటి అన్ని పనులు ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తుంది.
ఈ స్మార్ట్ డివైజ్‌ను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. మీరు బెడ్‌రూంలో ఉన్నా లేదా బయట ఉన్నా — మొబైల్ యాప్ ద్వారా వంటను ప్రారంభించగలరు, ఆపగలరు లేదా పర్యవేక్షించగలరు. ఇందులో “వర్చువల్ ఫ్లేమ్ సిస్టమ్” అనే సాంకేతికత ఉంది, దీని ద్వారా వంట ఉష్ణోగ్రతను ఖచ్చితంగా నియంత్రించవచ్చు. వంట పూర్తయిన వెంటనే మొబైల్‌కు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సౌకర్యాలు బిజీ లైఫ్‌స్టైల్ ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి.
ఇంకా ఒక ముఖ్యమైన ఫీచర్ “ఆటో క్లీనింగ్ సిస్టమ్”. వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడగడం అనే సమస్య ఇక్కడ ఉండదు. ఈ డివైజ్ స్వయంగా జిడ్డు స్థాయి గుర్తించి, అవసరమైన నీరు మరియు డిష్‌వాష్ లిక్విడ్ పరిమాణాన్ని సూచిస్తుంది. మూత మూసి ఉంచితే అది ఆటోమేటిక్‌గా పాత్రను శుభ్రం చేస్తుంది. ఇది టైమ్ సేవింగ్ మాత్రమే కాదు, వంటగదిలో పరిశుభ్రతను కూడా కాపాడుతుంది.
Upliance AI డివైజ్‌లో ప్రస్తుతం 750కి పైగా వంటకాలు ప్రీలోడ్‌గా ఉన్నాయి. ఇటీవల సౌత్ ఇండియన్ డిష్‌లను కూడా ఇందులో అప్‌డేట్ చేశారు. దీనివల్ల ఇడ్లీ, దోసె, సాంబార్, పులిహోర వంటి వంటకాలు సులభంగా చేయవచ్చు. భవిష్యత్తులో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ కూడా ప్రవేశపెట్టనుంది, దాంతో కొత్త వంటకాలను తరచుగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ కుకింగ్ అసిస్టెంట్ ధర రూ.30,000 నుండి రూ.40,000 మధ్యగా ఉంటుంది. రోజువారీ వంటను సులభతరం చేయాలనుకునే గృహిణులు, ఉద్యోగస్తులు లేదా టెక్ లవర్స్‌కి ఇది సరైన ఎంపికగా మారుతోంది. వంటకళను స్మార్ట్ టెక్నాలజీతో కలిపిన Upliance AI కిచెన్‌లలో కొత్త యుగానికి నాంది పలుకుతోంది.