Upliance AI: కూరగాయలు కట్ చేయడం నుంచి సాంబార్ వండేవరకు – అన్నీ చేసే స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్! ధర ఎంతంటే!

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశమైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. “పవన్ కళ్యాణ్ గారిని కలిసి అన్నీ చెప్పాలని ఉంది. కానీ ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో తెలియదు” అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని కూడా గ్రంధి తెలిపారు.

AP Healthcare : ఆరోగ్య రథం ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు, ప్రతి ఇంటి వద్ద ఉచిత వైద్యం!

గ్రంధి శ్రీనివాస్, 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. భీమవరం ప్రస్తుతం పేకాట క్లబ్‌ల వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

OnePlus Ace 6: వన్‌ప్లస్ నుంచి కొత్త ప్రీమియం ఫోన్! స్మార్ట్‌నెస్‌ అన్నీ ఒకే ప్యాక్‌లో..!

గ్రంధి మాట్లాడుతూ, “14 నెలలుగా క్లబ్‌ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్నారు. కానీ రెండు నెలలుగా ఆదాయం తగ్గడంతో వారు పోలీసు అధికారిపై దాడి మొదలుపెట్టారు. ఆ అధికారి మీద పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయడం చాలా దారుణం” అని అన్నారు. పోలీసులు పేకాట కార్యకలాపాలను ఆపినప్పుడు కొందరికి అది నచ్చలేదని, అందుకే వారు అధికారులను టార్గెట్ చేశారని ఆయన తెలిపారు.

Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ వేగం పుంజుకుంది.. 46% పనులు పూర్తయ్యాయి!

అతను ఇంకా వివరించారు — “కొత్త ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రెండు నెలలుగా మాత్రమే క్లబ్‌లు మూతపడ్డాయి. కానీ 14 నెలల పాటు నిరభ్యంతరంగా పేకాట సాగింది. ప్రతి క్లబ్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికార కూటమికి చెందిన వ్యక్తులు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక్కో బ్రాండీ షాప్ నుంచి నెలకు రూ.4.5 లక్షలు తీసుకున్నారని కూడా వినిపిస్తోంది” అని అన్నారు.

Suryalanka Nizampatnam : తుపాన్ ప్రభావం తీవ్రం.. సూర్యలంక నిజాంపట్నం బీచ్లు తాత్కాలికంగా మూసివేత!

డీఎస్పీ జయసూర్య విషయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సరికేనని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. “అసలు దొంగ ఎవరన్నది పవన్ కళ్యాణ్ తెలుసుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. ఆయన చర్యలు తీసుకుంటే నిజం వెలుగులోకి వస్తుంది” అని అన్నారు. పేకాట వ్యవహారంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు తీసుకున్న చర్యలు సరైనవని, వారికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని గ్రంధి తెలిపారు.ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీ, జనసేన మధ్య కొత్త పరిణామాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Boeing 777: పక్షుల గుంపు ఢీకొట్టిన Boeing 777.. పైలట్ సమయస్ఫూర్తితో సేఫ్ ల్యాండింగ్!
జుట్టు ఫాస్ట్‌గా పెరగాలంటే.. గోల్డెన్ రూల్స్ ఇవే! కచ్చితంగా పాటించాల్సిన 9 చిట్కాలు!
Elevated Rail Corridor: దక్షిణ మధ్య రైల్వే కొత్త మెగా ప్రాజెక్టు! గంటకు 350కి.మీ వేగం... ఇక గంటన్నర లో హైదరాబాద్!
ఈ రీఛార్జ్‌తో 3 నెలల పాటు OTT సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ! 168GB డేటా ఉచితం - 84 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో సంచలనం – అందరికీ అందుబాటులో 5జీ ఫోన్! ధర తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!