AP News: చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించిన రాటకొండ మధుబాబు.. సీఎం గ్రీన్ సిగ్నల్! అన్నమయ్య జిల్లా టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్..

AP News: నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా శాశ్వత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారిక కార్యాలయాన్ని మదనపల్లె పట్టణ కేంద్రంగా నిర్మించేందుకు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది.

AP News: చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించిన రాటకొండ మధుబాబు.. సీఎం గ్రీన్ సిగ్నల్!
tdp office of annamaiya district in madanapalle chandrababu green signal
  • Politics: మంగళగిరిలో సీఎం చంద్రబాబును కలిసిన రాటకొండ మధుబాబు.. సానుకూలంగా స్పందించిన అధినేత!

    మదనపల్లెలో త్వరలోనే జిల్లా టీడీపీ కార్యాలయం.. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం!

AP News: నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా శాశ్వత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారిక కార్యాలయాన్ని మదనపల్లె పట్టణ కేంద్రంగా నిర్మించేందుకు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. అన్నమయ్య జిల్లా పరిధిలోని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మదనపల్లె అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉంటుందని నివేదిస్తూ అందించిన ఈ వినతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సానుకూలంగా స్పందించారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు గానూ, మదనపల్లె వేదికగా త్వరలోనే నూతన అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థాపించాలని మరియు అందుకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణ ప్రక్రియలను వేగవంతం చేయాలని పార్టీ ఉన్నతాధికారులకు ఆయన తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

మదనపల్లె కేంద్రంగా జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అత్యంత సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఆదేశాలు జారీ చేసినందుకు గానూ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు తన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదనపల్లెలో శాశ్వత జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుండటం అన్నమయ్య జిల్లాలోని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకుడికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే అంశమని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ నూతన కార్యాలయం కేంద్రంగా పార్టీ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Tags

1 readers have reacted

Latest