MATA: ఉత్తర అమెరికాలో తెలుగు వైభవం.. ఘనంగా ముగిసిన MATA 2వ మహాసభలు!
MATA: ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి.
అమెరికా గడ్డపై తెలుగు పండుగ వాతావరణం.. సినీ తారల సందడితో MATA వేడుకలు..
ఫిలడెల్ఫియాలో తెలుగు వెలుగులు.. MATA మహాసభలకు భారీ స్పందన..
ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసమ్మేళనం తెలుగు కుటుంబాల సందడితో కళకళలాడింది.
ఈ మహాసభలకు ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు హాజరై, భారీ స్థాయిలో జరిగిన తెలుగు సమ్మేళనాల్లో ఒకటిగా నిలిపాయి. తెలుగు సంస్కృతి, కళలు, సేవా కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం ప్రవాస తెలుగు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
MATA మహాసభలకు సినీ రంగ ప్రముఖులు హాజరై సందడి చేశారు. నటులు నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్లు సుమ, ప్రదీప్ మాచిరాజు, నిఖిల్ విజయేంద్ర సింహా, హాలీవుడ్ నటుడు విషి అయ్యర్, శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ టెక్నాలజీ, లైటింగ్, వేదిక నిర్వహణతో కార్యక్రమాలు ఆకట్టుకునేలా సాగాయి.
తెలుగు సమాజానికి విశేష సేవలు అందించిన ప్రముఖులను MATA ఘనంగా సత్కరించింది. ప్రముఖ నటి జయప్రదకు MATA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించారు. అలాగే డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లకు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులు ప్రదానం చేశారు. సమాజ సేవ, వ్యాపారం, వైద్యం, కళలు, ఆవిష్కరణలు తదితర రంగాల్లో సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు అందించారు.
అవార్డులు అందుకున్న వారిలో టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) ఉన్నారు.
మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి కలిసి ప్రార్థనలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కల్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువత అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్‌వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి.
MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో ఈ మహాసభలు విజయవంతంగా నిర్వహించారు. వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి మార్గదర్శకత్వం అందించారు.
కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, తదితరులు కీలక పాత్ర పోషించారు.
స్పిరిచ్యువల్, మెంబర్‌షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ & మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా తదితరుల సహకారం మహాసభ విజయానికి దోహదపడింది.
తెలుగు సంస్కృతి పరిరక్షణ, సేవా భావం, సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన MATA 2వ మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒక్క వేదికపైకి తీసుకొచ్చిన ఘన వేడుకగా నిలిచాయి.
Tags
Be the first to react