LIVE
Chandrababu: సింగపూర్ పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీలు!  •  Mahanadu: బ్రిస్బేన్‌లో ఘనంగా టీడీపీ మహానాడు 2026.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస తెలుగు ప్రజలు!  •  London: భారతీయ యువకుడి హత్యతో లండన్ ఉలిక్కిపాటు.. ప్రవాస భారతీయులలో పెరుగుతున్న ఆందోళన!  •  Nara Lokesh: అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి... క్షేత్రస్థాయి వీడియోతో మంత్రి లోకేశ్‌ కౌంటర్!  • 
NRI

Mahanadu: బ్రిస్బేన్‌లో ఘనంగా టీడీపీ మహానాడు 2026.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస తెలుగు ప్రజలు!

Mahanadu: తెలుగుదేశం పార్టీ క్వీన్స్‌లాండ్ విభాగం ఆధ్వర్యంలో బ్రిస్బేన్ నగరంలో నిర్వహించిన మహానాడు 2026 కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

Kasthuri S 1 min read
Mahanadu
Mahanadu

ఆస్ట్రేలియాలో తెలుగుదేశం మహానాడు విజయవంతం..

బ్రిస్బేన్ మహానాడుకు హాజరైన ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గ్రీష్మ, ఎమ్మెల్యే శ్రావణి..

ఆస్ట్రేలియా: తెలుగుదేశం పార్టీ క్వీన్స్‌లాండ్ విభాగం ఆధ్వర్యంలో బ్రిస్బేన్ నగరంలో నిర్వహించిన మహానాడు 2026 కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ మహానాడుకు ముఖ్య అతిథులుగా విజయనగరం ఎంపీ శ్రీ కాళ్లిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది. పార్టీ ఆలోచనలు, ప్రజా సేవా కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిపై తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని వక్తలు పేర్కొన్నారు.

బ్రిస్బేన్ టీడీపీ బృందం సమన్వయంతో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. కార్యక్రమ నిర్వహణలో విశ్వనాథ్ దాసరి, మాధవ్ జొన్నలగడ్డ, రామకృష్ణ గూడూరు, చలసాని రవి, బొమ్మసాని దత్తాత్రేయ, బొడపాటి నాగేష్, యాద్ల నాగార్జున, చింతపల్లి భరత్, ప్రసాద్ దబ్బర్, దాసరి భార్గవ్ సత్య, ఆనంద్ వాడలమాని, రాజేష్ కనికటి, హరికృష్ణ జంపాల, పార్ధ నున్న, తరుణ్ వరాహ, అబుదుల్లా షేక్, వంశీ పుట్టగుంట, అనురాధ ఈదర, మణికంఠ మెద్దల తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహానాడు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిస్బేన్‌లో తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…