Uganda: సినిమా, రాజకీయ రంగాల్లో సరికొత్త అధ్యాయం ఎన్టీఆర్.. కంపాలా మినీ మహానాడులో ఎన్నారైల హర్షం!

Uganda: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నట సార్వాబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 103జయంతి సందర్బంగా ఇటీవల ఉగండ రాజధాని కంపాలా నగరం లో NRI TDP కార్యకర్తలు మినీ మహానాడు ఘనంగా నిర్వహించడం జరిగింది.

NTR a new chapter in cinema and politics NRIs rejoice at Kampala Mini Mahanadu
NTR a new chapter in cinema and politics NRIs rejoice at Kampala Mini Mahanadu
  • ఉగాండాలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.. కంపాలా నగరంలో ఎన్నారై టీడీపీ మినీ మహానాడు ఘనం!

  • కంపాలాలో మినీ మహానాడు సందడి.. అన్నగారి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన NRI TDP కార్యకర్తలు!

Uganda: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నట సార్వాబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 103జయంతి సందర్బంగా ఇటీవల ఉగండ రాజధాని కంపాలా నగరం లో NRI TDP కార్యకర్తలు మినీ మహానాడు ఘనంగా నిర్వహించడం జరిగింది.....

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...తెలుగు జాతి గర్వకారణమైన స్వర్గీయ Nandamuri Taraka Rama Rao గారిని స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని 
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన మహానేత ఎన్టీఆర్ గారు అని వారు కొనియాడారు,
సినీ రంగంలో లెజెండ్గా, రాజకీయ రంగంలో ప్రజానాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని 
1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించి.
పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసి 
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని  నేటికీ కోట్లాది మంది ప్రజలకు ఆయన ఆదర్శప్రాయ నాయకుడు ఎన్టీఆర్ గారు అని వారు ఈ సందర్బంగా గుర్తు చేసారు,
ఎన్టీఆర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి తెలుగువాడికి మార్గదర్శకంగా నిలిచాయని...
ఆయన చూపిన బాటలోనే తెలుగు దేశం పార్టీ ముందుకు సాగుతోంది అని వారు గుర్తు చేసుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ గారు స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం... ఆయన కలలుగన్న సమాజ నిర్మాణానికి మనమంతా కృషి చేసి తెలుగు జాతి గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం మన బాధ్యత అని వారు గుర్తు చేసారు,

ఈ సందర్భంగా మహానేత ఎన్టీఆర్ గారికి NRI TDP కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు చిన్నా చౌదరి గరికపాటి. జంపని బాలాజీ, యలమంచిలి భాను,గడిపర్తి శేషు, దొడ్డ శేషు బాబు, పీవీన్ కిరణ్ , నల్లూరి నవీన్ బాబు , ఎలిగేటి మురళి, బీరవల్లి శరత్, శివకాంత్, రామ్ చిరుమామిళ్ల, కళ్యాణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest