TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలకు సన్నాహాలు!

TCA: అమెరికాలోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

TCA 1
TCA 1

యువతలో నాయకత్వ లక్షణాలకు వేదికగా ‘యూత్ ఇన్నోవేషన్ & లీడర్షిప్ ఫెస్టివల్’..

ఐదు దశాబ్దాల తెలుగు సేవకు ఘన నివాళి.. హ్యూస్టన్లో TCA స్వర్ణోత్సవాలు..

హ్యూస్టన్: అమెరికాలోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తన 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ‘TCA 50’ పేరుతో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలు ఆగస్టు 7, 8 తేదీల్లో టెక్సాస్ రాష్ట్రంలోని రోసెన్బెర్గ్లో ఉన్న ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్ వేదికగా నిర్వహించనున్నారు.

ఐదు దశాబ్దాలుగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ వస్తున్న TCA, ఈ స్వర్ణోత్సవాలను ప్రత్యేక కార్యక్రమాలతో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా యువత కోసం ప్రత్యేకంగా “యూత్ ఇన్నోవేషన్ & లీడర్షిప్ ఫెస్టివల్”ను ఏర్పాటు చేస్తున్నారు. నేటి యువతను రేపటి నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

యువతలో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడం, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం అందించడం ఈ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశ్యాలు. అలాగే యువత మధ్య బలమైన పరిచయాలు, నెట్వర్కింగ్ అవకాశాలను కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.

తెలుగు సమాజంలోని యువత ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగస్వాములు కావాలని, తమ ప్రతిభను ప్రదర్శించి స్ఫూర్తి పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం tca50.org వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.

Tags

Be the first to react

Latest