USA: ఛార్లెట్‌లో ఘనంగా నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు!
USA: తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటన, శక్తివంతమైన డైలాగులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అమెరికాలోని ఛార్లెట్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు.
బాలయ్య బర్త్డే వేడుకల్లో సందడి చేసిన అమెరికా అభిమానులు..
ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానానికి సెల్యూట్.. బాలకృష్ణ జన్మదిన వేడుకలు..
ఛార్లెట్: తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటన, శక్తివంతమైన డైలాగులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను అమెరికాలోని ఛార్లెట్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. బాలకృష్ణ సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
ఐదు దశాబ్దాలకు పైగా వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్న బాలకృష్ణ, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారని అభిమానులు పేర్కొన్నారు. మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తూ, యువ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నారని కొనియాడారు.
తన సెకండ్ ఇన్నింగ్స్ను ‘అఖండ’ వంటి విజయవంతమైన చిత్రంతో మరింత బలపరిచిన బాలకృష్ణ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారని అభిమానులు తెలిపారు. ఆయన నటించిన చిత్రాలు భారీ విజయాలు సాధిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని అన్నారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘సమరసింహారెడ్డి’ చిత్రాన్ని అభిమానులు ప్రత్యేకంగా వీక్షించారు. థియేటర్ల వద్ద సందడి చేస్తూ తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఈ వేడుకల్లో ఛార్లెట్ ప్రాంతానికి చెందిన బాలయ్య అభిమానులతో పాటు టీడీపీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ అభిమాన నటుడి పుట్టినరోజును ఒక పండుగలా నిర్వహించి, బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Tags
Be the first to react