LIVE
Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  •  Health Tips: వీటిలో వాటర్ తాగుతున్నారా... అయితే వాటిని కొనితెచ్చుకున్నట్లే!  •  Praja Vedika: నేడు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!  •  IndiGo fligth: హై అలర్ట్.. లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... టాయిలెట్ లో కలకలం రేపిన నోట్!  •  Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!  •  Praja Vedika: రేపు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  Trains Cancelled: రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఈ రూట్లో పలు రైళ్లు రద్దు.. దారిమళ్లింపు!!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Telugu: మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు ఘనంగా ప్రారంభం!

Telugu: తెలుగు భాషను కాపాడుకోవడం, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాకుండా మన జీవన విధానం, సంస్కృతి, నాగరికతకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

Kasthuri S 2 min read
Telugu
Telugu

150 దేశాల్లో తెలుగు వెలుగు.. భాషా వ్యాప్తిపై ప్రవాసుల కృషి..

రాజమహేంద్రవరంలో తెలుగు సాహిత్య మహాసభలు.. భాషాభిమానుల సందడి..

రాజమహేంద్రవరం: తెలుగు భాషను కాపాడుకోవడం, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాకుండా మన జీవన విధానం, సంస్కృతి, నాగరికతకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల తొలి రోజు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైతన్యరాజు మాట్లాడుతూ, మాతృభాష పరిరక్షణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

గత మూడు సంవత్సరాలుగా తమ విద్యాసంస్థల్లో తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నామని, తెలుగు, సంస్కృత భాషల్లో పీహెచ్‌డీ చేసే అవకాశాలను కూడా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. భాషా వికాసానికి విద్యాసంస్థలు కీలక వేదికలుగా మారాలని ఆకాంక్షించారు.

సభకు అధ్యక్షత వహించిన శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ, తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో సాహిత్య సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జులైలో కాకినాడ, ఆగస్టులో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో, సెప్టెంబరులో మలేసియాలో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సాహిత్యం పేరుతో కొందరు సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, కవుల నుంచి రుసుములు వసూలు చేసే ధోరణిని సాహిత్య ప్రేమికులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, బాల్యంలో తెలుగు ఉపాధ్యాయులు బోధించిన అనేక విషయాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని చెప్పారు. మాతృభాషతో ఏర్పడే అనుబంధం జీవితాంతం నిలిచిపోతుందని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి చప్పిడి రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో తెలుగువారు భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలుగు కళాకారులను విదేశాలకు పంపి ప్రత్యేక సాహిత్య సదస్సులు నిర్వహిస్తే భాష మరింత విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు తెలుగు నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నందున ప్రత్యేక సిలబస్ రూపొందించాలని సూచించారు.

సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరిస్తూ పోతన పద్యాలను ఆలపించారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం రిజిస్ట్రార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి సాహిత్య సభలు తెలుగు భాష వికాసానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు.

తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ మాజీ రిజిస్ట్రార్ గౌరీశంకర్ మాట్లాడుతూ, 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు, సాహితీవేత్తలు భాష పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకోవడం అభినందనీయమని అన్నారు.

కార్యక్రమంలో తెలుగు పదాలను సరైన ఆంగ్ల ఉచ్చారణ రూపంలో అందించే ‘కరెక్ట్ స్పెల్’ యాప్‌ను ఆవిష్కరించారు. యాప్ రూపకర్త శ్రీనివాసశర్మ మాట్లాడుతూ, తెలుగు పదాన్ని టైప్ చేస్తే దానికి తగిన సరైన ఆంగ్ల ఫొనెటిక్ రూపం వెంటనే కనిపిస్తుందని తెలిపారు. దీని ద్వారా విదేశాల్లో ఉన్నవారికి తెలుగు భాషను మరింత సులభంగా పరిచయం చేయవచ్చని చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు రచయితల కవితా సంపుటాలు, నవలలను ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు సభకు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, బోయ హైమావతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు భాష వైభవాన్ని చాటుతూ, భవిష్యత్ తరాలకు భాషా వారసత్వాన్ని అందించాలనే సంకల్పంతో సాగిన ఈ మహాసభలు సాహిత్యాభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Tags

Be the first to react

More Coverage

Uganda: సినిమా, రాజకీయ రంగాల్లో సరికొత్త అధ్యాయం ఎన్టీఆర్.. కంపాలా మినీ మహానాడులో ఎన్నారైల హర్షం!

Uganda: సినిమా, రాజకీయ రంగాల్లో సరికొత్త అధ్యాయం ఎన్టీఆర్.. కంపాలా మినీ మహానాడులో ఎన్నారైల హర్షం!

Uganda: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నట సార్వాబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 103జయంత…