TTA: TTA మెగా కన్వెన్షన్ 2026 సందర్భంగా కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక ‘రీల్స్ పోటీ’!
TTA: అమెరికాలోని తెలుగు సమాజం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘TTA మెగా కన్వెన్షన్ 2026’ను పురస్కరించుకుని నిర్వాహకులు ప్రత్యేకమైన రీల్స్ పోటీని ప్రకటించారు.
తెలుగు సంబరాలను ప్రపంచానికి చాటేందుకు క్రియేటర్లకు సువర్ణావకాశం..
తెలుగు సంబరాలను ప్రపంచానికి చాటే వేదికగా TTA రీల్స్ కాంటెస్ట్..
అమెరికాలోని తెలుగు సమాజం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘TTA మెగా కన్వెన్షన్ 2026’ను పురస్కరించుకుని నిర్వాహకులు ప్రత్యేకమైన రీల్స్ పోటీని ప్రకటించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TTA) ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభల విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు కంటెంట్ క్రియేటర్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుంచి 19, 2026 వరకు జరగనున్న ఈ మెగా కన్వెన్షన్లోని కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక ఆకర్షణలను హైలైట్ చేస్తూ క్రియేటర్లు వినూత్నమైన రీల్స్ రూపొందించాలని నిర్వాహకులు కోరారు.
ఈ పోటీలో పాల్గొనే వారు TTA కన్వెన్షన్ ఈవెంట్లకు సంబంధించిన సృజనాత్మక వీడియోలను రూపొందించి సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేసే సమయంలో @ttaconvention2026, @ttausa1, @ttacharlotte ఇన్స్టాగ్రామ్ పేజీలను కొలాబరేట్ చేయడం తప్పనిసరి.
అలాగే రీల్స్కు #TTAMegaConvention2026, #TTAConvention2026ReelsContest అనే హ్యాష్ట్యాగ్లను తప్పనిసరిగా ఉపయోగించాలని నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీలో అర్హత సాధించే క్రియేటర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. 5,000 మందికి పైగా ఫాలోవర్లు కలిగి, నిబంధనలకు అనుగుణంగా రీల్స్ సమర్పించిన వారికి ఉచిత జనరల్ అడ్మిషన్ పాస్ అందజేయనున్నారు.
పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ప్రత్యేక TTA మెమెంటోలు, VIP యాక్సెస్ పాస్లు, అలాగే ప్రముఖులతో ప్రత్యక్షంగా కలిసే అవకాశం కల్పించనున్నారు.
రీల్స్ సమర్పించడానికి చివరి తేదీ జులై 5, 2026గా నిర్ణయించారు. ముందుగా రీల్స్ పోస్ట్ చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరే అవకాశం ఉంటుందని, క్రియేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని TTA నిర్వాహకులు సూచించారు. తెలుగు సంస్కృతి, ఐక్యత, ప్రతిభను ప్రపంచ వేదికపై చూపించే ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది క్రియేటర్లు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Tags
Be the first to react