ATA: ఆటా 19వ మహాసభల్లో యూత్ క్రూజ్ ప్రత్యేక ఆకర్షణ.. తెలుగు యువతకు కొత్త అనుభూతి!
ATA: అమెరికా తెలుగు సంఘం (ఆటా – ATA) నిర్వహిస్తున్న 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్ సందర్భంగా యువత కోసం ప్రత్యేకమైన ‘యూత్ క్రూజ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం 2026 జులై 31న బాల్టిమోర్ హార్బర్లో నిర్వహించనున్నారు.
అమెరికా తెలుగు యువతకు వినోదం, స్నేహాలకు వేదికగా ప్రత్యేక కార్యక్రమం..
బాల్టిమోర్ హార్బర్లో యువత సందడి.. ఆటా నిర్వహించనున్న ప్రత్యేక యూత్ క్రూజ్..
అమెరికా తెలుగు సంఘం (ఆటా – ATA) నిర్వహిస్తున్న 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్ సందర్భంగా యువత కోసం ప్రత్యేకమైన ‘యూత్ క్రూజ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం 2026 జులై 31న బాల్టిమోర్ హార్బర్లో నిర్వహించనున్నారు.
16 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువతను దృష్టిలో ఉంచుకుని ఈ క్రూజ్ను రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు యువత ఒకే వేదికపై కలుసుకుని కొత్త స్నేహాలను ఏర్పరుచుకోవడంతో పాటు ఆనందంగా సమయం గడిపేలా ఈ కార్యక్రమం ఉండనుంది.
యూత్ క్రూజ్లో భాగంగా డీజే సంగీతం, డ్యాన్స్ ఫ్లోర్, ప్రత్యేక ఆహార వసతులు, పానీయాల ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువతకు వినోదంతో పాటు పరస్పర పరిచయాలు, సాంస్కృతిక అనుబంధాలు పెంచుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
ఈ క్రూజ్లో పాల్గొనాలనుకునే వారు 60 డాలర్ల టికెట్ ధర చెల్లించి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న యువత యూత్ కమిటీని లేదా ఆటా అధికారిక వెబ్సైట్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఆటా మహాసభల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ యూత్ క్రూజ్ అమెరికాలోని తెలుగు యువతకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags
Be the first to react