TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!
TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల త్రోబాల్ టోర్నమెంట్ 2026 విజయవంతంగా ముగిసింది.
పెన్సిల్వేనియాలో తానా మహిళల క్రీడా సందడి.. ఘనంగా ముగిసిన త్రోబాల్ పోటీలు..
క్రీడా స్ఫూర్తిని చాటిన తెలుగు మహిళలు.. తానా త్రోబాల్ టోర్నమెంట్లో హోరాహోరీ పోటీలు..
పెన్సిల్వేనియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల త్రోబాల్ టోర్నమెంట్ 2026 విజయవంతంగా ముగిసింది. సేవా కార్యక్రమాలతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ వస్తున్న తానా మరోసారి తెలుగు సమాజంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్లో జూన్ 13న జరిగిన ఈ టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. మొత్తం 60 మందికి పైగా క్రీడాకారిణులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడాకారిణులను ప్రోత్సహించారు. తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు టోర్నమెంట్ను ప్రారంభించి జట్లకు అభినందనలు తెలిపారు.
లీగ్ మ్యాచ్లు, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లతో సాగిన పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. అన్ని జట్లు క్రీడా స్ఫూర్తితో పోటీ పడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మ్యాచ్లను నిష్పక్షపాతంగా నిర్వహించిన రిఫరీలు దీప్తి కోక, చైతన్య కట్టాలకు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో రంజిత్ మామిడి, దీప్తి కోక, చలం పావులూరి చేసిన సమన్వయం, కృషి కీలకంగా నిలిచింది. యువ వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ‘యూత్ వాలంటీర్ రాఫెల్ ప్రైజ్’ను కేతన్ మామిడి, కార్తికేయ రావత్లు అందుకున్నారు.
ఈ టోర్నమెంట్లో డ్రాగన్స్ టీమ్ విజేతగా నిలిచింది. అనురాధ సౌందరరాజన్, రూబి ఈశ్వరమూర్తి, శేత్ర సంతానం, మధు మాగేష్, నందిని జనార్థనన్, దివ్యతేజస్విని తిరుమలశెట్టి, రీష్మా దొమ్మరాజు, ధివ్య కరుప్పన్, శ్వేత శ్రీగణేష్లు అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.
అల్టిమేట్ వారియర్స్ టీమ్ రన్నరప్గా నిలిచింది. సుధ, అభి, కల్పన, భాను, మాలతి, తంగం, హుస్సేని, రంజని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలు, రన్నరప్ జట్లకు తానా మిడ్ అట్లాంటిక్ ప్రతినిధులు నగదు బహుమతులు, ట్రోఫీలు, పతకాలను అందజేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తానా మిడ్ అట్లాంటిక్ బృంద సభ్యులు సునీల్ కోగంటి, ప్రసాద్ క్రొత్తపల్లి, శ్రీధర్ సాదినేని, విశ్వనాథ్ కోగంటి, సురేష్ యలమంచి, ఈవెంట్ గ్రాండ్ స్పాన్సర్ గౌరి కర్రోతు, ఇతర స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని, క్రీడా ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని తానా ప్రతినిధులు ఆకాంక్షించారు.
Tags
Be the first to react