రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), బాహుబలి (Baahubali) సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఒక పాన్ ఇండియా స్టార్ (Pan-India Star)గా ఎదిగిన విషయం తెలిసిందే. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. బాహుబలి తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా – యాక్షన్ (Action), సైన్స్ ఫిక్షన్ (Science Fiction), పౌరాణికం (Mythological), హారర్ కామెడీ (Horror Comedy) వంటి అన్ని జానర్స్ (Genres)లో వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

 

ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

 

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ (Crazy Projects) ఉన్నాయి. వాటిలో ప్రధానంగా "ది రాజా సాబ్ (The Raja Saab)" మరియు "ఫౌజీ (Fouji)" చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ది రాజా సాబ్‌ను డైరెక్టర్ మారుతి (Director Maruthi) హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన (Massive Response) లభించింది. డ్యూయల్ రోల్ (Dual Role)లో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమా డిసెంబర్ 5న (December 5) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఫౌజీ చిత్రానికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నారు. సీతారామం తర్వాత ఇది హను రూపొందిస్తున్న హై స్టాండర్డ్ మూవీగా భావిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సైనికుడి (Soldier)గా కనిపించనున్నారు. హీరోయిన్‌గా ఇమాన్యుయేల్ ఇస్మాయెల్ (Immanuel Ismail) నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది (Next Year) విడుదల కానుంది.

 

ఇది కూడా చదవండి: Students Welfare: ఏపీలో వారందరికి పండగే! ఆ పథకం అమలు ఫ్రీగా ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు!

 

అంతేగాక, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో "స్పిరిట్ (Spirit)" అనే చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధమైంది. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్ (Police Officer) పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అదేవిధంగా సలార్-2 (Salaar 2), కల్కి-2 (Kalki 2) చిత్రాల్లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. ఇలా చేతినిండా సినిమాలతో ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా (Fully Busy) ఉన్నారు.

 

ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!

 

ఇదిలా ఉండగా, ఇటీవల ప్రభాస్‌కి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఆయన తొలి చిత్రం ఈశ్వర్ (Eeswar) పూజా కార్యక్రమ సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించినదిగా తెలుస్తోంది. “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు… ఈ ఈశ్వర్‌కు మూడు గుండెలు” అనే డైలాగ్‌ను టెన్షన్‌లో చెప్పినట్లు చెప్పిన ప్రభాస్, ఆ సమయంలో తన తండ్రి (Father) చేతిని పట్టుకుని "యస్" అని చెప్పడంతో, తొలిసారి కళ్లలో నీళ్లు వచ్చినట్టు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఈ భావనతో కూడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

ఇది కూడా చదవండి: Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!

RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!

Flight Accident: కెనడాలో విషాదం..! గాలిలో విమానాలు ఢీకొని కేరళ యువ పైలట్ మృతి!

Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..

Free Coaching: ఆ విద్యార్థులకు మంత్రి విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్! ఉచిత భోజన, వసతి సౌకర్యం..

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!

Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!

Teacher Meeting: ఏపీలో స్కూల్ విద్యార్థులుతల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్టైమింగ్స్ ఇవే!

AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!

UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group