ఇటీవల అనంతపురం జిల్లా, ధర్మవరానికి చెందిన షేక్ అబిదా ఓ మహిళ తన కుటుంబ పోషణ కొరకు ఒమాన్ దేశం వెళ్ళటం జరిగింది. తను వర్క్ వీసాకు బదులుగా ఏజెంట్ ద్వారా విజిట్ వీసాపై ఆదేశానికి వెళ్ళింది.
నెల రోజుల క్రితం ఒమన్‌కు వెళ్లిన షేక్ అబీదా, ప్రయాణం సమయంలోనే అస్వస్థతకు గురికాగా వెంటనే స్పందించిన విమానాశ్రయ అధికారులు మరియు క్లినిక్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.
సుమారు 15 రోజుల చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం మెరుగుపడింది.
అదే సమయంలో ఈ విషయం తెలుసుకున్న NRI TDP Oman సభ్యులు ఆసుపత్రి యాజమాన్యం ను సంప్రదించారు. వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని NRI-TDP సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ మరియు స్థానిక డెక్కన్ వింగ్‌తో కలిసి పూర్తి సహాయ సహకారాలు అందించారు.
అదేవిధంగా ట్రీట్మెంట్ కి సంబంధించిన బిల్లులు మరియు తన తిరుగు ప్రయాణానికి అవసరమైనటు వంటి విమాన టికెట్టు కొరకు ఆర్థిక సహాయం అబిదా బేగంకు అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
కాగా, నిన్న ఫిబ్రవరి 4న ఆమె హైదరాబాద్‌కు బయలుదేరగా, అక్కడి నుంచి స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం చేరుకునేందుకు NRI-TDP సెల్ సహాయం కూడా చేయడం జరిగింది.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఒక ఏజెంట్ ఆమెను విజిట్ వీసాపై ఒమన్‌కు పంపగా, ఆరోగ్య సమస్యల వల్ల పని చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె, చివరకు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.
సకాలంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టిడిపి సెల్, NRI-TDP ఒమన్ మరియు డెక్కన్ వింగ్ టీం మెంబెర్స్ జోక్యం చేసుకోవడంతో ఆమె సురక్షితంగా భారత్‌కు చేరుకోగలిగింది.
ఆమె తన అనుభవాన్ని పంచుకుంటూ, మహిళలు ఎజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని, గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా APNRT, లేదా మీ ప్రాంతంలోనే తెలుగుదేశం చెందిన నాయకులను లేదా ఎన్నారై టిడిపి సెల్ వారిని లేదా నిర్ధారిత అధికారిక వర్గాలను మాత్రమే సంప్రదించాలని అబిదా బేగం విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా తనకు ఎంతో ఆదరణ ఇచ్చినటు వంటి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి లోకేష్ గారికి ఇలాంటి టీం ని అందించి తనకు ప్రాణ రక్షణ కల్పించినందుకు కన్నీటి పర్యంతమవుతూ ఆమె తన తరపున తన కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేశారు.