IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్!

Cricket: టీ20 వరల్డ్ కప్ - ఇటలీపై వెస్టిండీస్ విక్టరీ.. అజేయంగా సూపర్-8లోకి!

T20 Cricket: టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గురువారం కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇటలీని మట్టికరిపించి, విండీస్ తన జైత్రయాత్రను కొనసాగించింది.

Published : 2026-02-19 15:57:00
  • టీ20 ప్రపంచకప్‌లో ఇటలీపై 42 పరుగులతో గెలిచిన వెస్టిండీస్..
     
  • 75 పరుగులతో రాణించిన కెప్టెన్ షాయ్ హోప్…

T20 Cricket: టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇటలీపై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా సూపర్‌ 8 దశలో ప్రవేశించింది. తొలుత కెప్టెన్ షాయ్ హోప్ (75) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు, బౌలింగ్‌లో షామార్ జోసెఫ్ (4/30), మాథ్యూ ఫోర్డ్ (3/25) చెలరేగడంతో విండీస్ విజయం సునాయాసమైంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్, హెట్‌మెయర్ త్వరగా ఔటయ్యారు. అయితే, కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. రోస్టన్ చేజ్ (24)తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24), మాథ్యూ ఫోర్డ్ (16) వేగంగా ఆడటంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఇటలీ బౌలర్లలో క్రిషన్ కాలుగమగే, బెన్ మనేంటీ చెరో రెండు వికెట్లు తీశారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. పవర్‌ప్లే ముగిసేసరికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జేజే స్మట్స్ (24), బెన్ మనేంటీ (26) కాసేపు పోరాడినా, విండీస్ బౌలర్ల ధాటికి ఇటలీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా పేసర్ షామార్ జోసెఫ్ నాలుగు వికెట్లతో ఇటలీ పతనాన్ని శాసించాడు. అతనికి మాథ్యూ ఫోర్డ్ మూడు వికెట్లతో, గుడకేశ్ మోటీ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించారు. దీంతో ఇటలీ 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది.

Spotlight

Read More →